Photo Story: సినిమాల్లో కొనసాగిన వరకే హీరోయిన్లకు గుర్తింపు ఉంటుంది. ఆ తరువాత వారిని ఎవరూ పట్టించుకోరు. దీంతో వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు వెళ్తారు కొందరు భామలు. కానీ అదృష్టం లేకపోవడంతో అవకాశాలు రాక సినిమాలకు దూరంగా ఉంటారు. కానీ సినిమాల్లో ఉన్నంతకాలం స్టార్ హీరోలతో నటించాలని ఆరాటపడుతూ ఉంటారు. బాలీవుడ్ కు చెందిన ఓ భామ సొంత ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంతో సౌత్ వైపు వచ్చింది. ఇక్కడ స్టార్ గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల పక్కన నటించి ఆకట్టుకుంది. కానీ ఈ మధ్య ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. తమిళంలో ఓ బిగ్ హీరోతో నటించిన ఓ మూవీ భారీ డిజాస్టర్ తరువాత ఆ సుందరి గురించి ఇప్పుడు చర్చకు వచ్చింది. ఎందుకంటే ఆమె చిన్న నాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే?
బక్కచిక్కిన నడుముతో అందాలను ఆరబోసి యూత్ ను బాగా ఆకట్టుకున్న ఆ భామ ఎవరో కాదు పూజా హెగ్డే. మహారాష్ట్రలోని ముంబయ్ లో 1990 అక్టోబర్ 13న జన్మించింది పూజా జన్మించింది. చదువు పూర్తయిన తరువాత ఫ్యాషన్ షో ల్లో ఎక్కువగా పాల్గొంది. ఆ తరువాత 2009లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. అయితే ఇందులో తొలి రౌండ్ లోనే ఎలిమినేట్ అయింది. ఆ తరువాత 2010లో రన్నరప్ గా నిలిచింది. ఆ తరువాత సినిమాల వైపుచూసి పూజా హెగ్డే హిందీలో సరైన అవకాశాలు రాకపోవడంతో సౌత్ వైపు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఆమెకు 2012లో ‘ముగమూడి’ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత తెలుగులో అవకాశం వచ్చింది.

2014లో తెలుగులో ‘ఒక లైలా కోసం’ అనే సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించంది. ఈ మూవీ యావరేజ్ హిట్టు కొట్టినా పూజా హెగ్డేకు పేరొచ్చింది. అంతేకాకుండా ఇదే సమయంలో ఆమెకు ఈ సినిమా ద్వారా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా లభించింది. దీంతో ఆమెకు తెలుగులోరే మెగా హీరో వరున్ తేజ్ తో కలిసి ‘ముకుంద’లోనటించే చాన్స్ వచ్చింది. ఇందులో అచ్చమైన తెలుగుఅమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది. అయితే ఇదే సమయంలో బాలీవుడ్ నుంచి స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ‘మొహంజోదారో’లో నటించింది. కానీ ఆమెకు తెలుగులో నటించిన డీజే, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, అలా వైకుంఠపురం లాంటి సినిమాలు గుర్తింపు తెచ్చాయి.
ఈ క్రమంలో తమిళ ఇళయ దళపతి విజయ్ తో కలిసి ‘బీస్ట్’ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఈ మూవీ డిజస్టర్ కావడంతో అమ్మడు మళ్లీ సినిమాల్లోకనిపించడం లేదు. కానీ ఇటీవల ఆమె చేతిలో సినిమాలు లేక సోషల్ మీడియా ద్వారా తనకు సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేస్తోంది. తాజాగా ఆమె బర్త్ డే సందర్భంగా చిన్న నాటి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో పూజా హెగ్డే ఎంతో అందంగా ఉన్నారు. దీనిపై యూత్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.