God Twitter Review: ఇరైవన్ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో గాడ్ గా విడుదల చేశారు. జయం రవి-నయనతార హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రంలో రాహుల్ బోస్ కీలక రోల్ చేశారు. ఇప్పటికే ప్రీమియర్స్ ముగియగా గాడ్ మూవీ ఎలా ఉందో చూద్దాం…
గాడ్ చిత్ర కథ విషయానికి వస్తే.. టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి అతి దారుణంగా చంపుతూ ఉంటాడు సైకో కిల్లర్ రాహుల్ బోస్. చంపిన అమ్మాయిలను నగ్నంగా మార్చి శవాల వద్ద స్మైల్ సింబల్స్ వదిలి వెళుతుంటాడు. స్మైలీ సైకో కిల్లర్ ని పట్టుకునేందుకు మోస్ట్ రూత్ లెస్ ఆఫీసర్ జయం రవి రంగంలోకి దిగుతాడు. జయం రవిని నయనతార అమితంగా ప్రేమిస్తుంది. ఒక దశలో సైకో కిల్లర్ టార్గెట్ జయం రవి ఫ్యామిలీ అవుతుంది. మరి ఈ థ్రిల్లింగ్ కిల్లింగ్ గేమ్ లో జయం రవి సైకో కిల్లర్ ని కట్టడి చేశాడా లేదా అనేది సినిమా
క్రైమ్ థ్రిల్లర్స్ అన్నింట్లో ఒకటే కథ. కాబట్టి ఇక్కడ స్క్రీన్ ప్లే మేటర్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ఆసక్తికరంగా మలచినప్పుడు మంచి ఫలితం దక్కుతుంది. ఆ విషయంలో గాడ్ ఫెయిల్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది. సైకో కిల్లర్ ని అత్యంత బలవంతుడిగా చూపించి హీరో పాత్రను సరిగా ఎలివేట్ చేయలేదని టాక్. హీరో ప్రతిసారి విలన్ ముందు తేలిపోవడం బాగోలేదని అంటున్నారు.
అలాగే పెద్దగా ట్విస్ట్స్, థ్రిల్స్ లేని కథనం మెప్పించలేదని ఆడియన్స్ అభిప్రాయం. నెక్స్ట్ ఏం జరిగిపోతుందో తెలిసిపోవడం వలన ప్రేక్షకులు కనెక్ట్ కావడం లేదట. దర్శకుడు అహ్మద్ రాసుకున్న ఇన్వెస్టిగేషన్ సీన్స్ పేలవంగా ఉన్నాయని అంటున్నారు. విలన్ ఎవరో తెలిశాక కూడా పోలీసులు ఏం చేయలేకపోవడం నమ్మబుద్ది కాదంటున్నారు. ముఖ్యంగా నయనతార పాత్రకు ప్రాధాన్యత లేదంటున్నారు. కథలో కీలకం కానప్పుడు నయనతార వంటి పెద్ద హీరోయిన్ ని తీసుకోవడం వేస్ట్ అంటున్నారు. మొత్తంగా గాడ్ పూర్తి స్థాయిలో మెప్పించలేదని ఆడియన్స్ అభిప్రాయం…
#chandramukhi2 final Run is almost just 2 weeks only #CM2 – below average #Iraivan – big disaster
— Dhanu Dhanu (@dhanudhanu02) October 12, 2023