https://oktelugu.com/

Naga Chaitanya: సామ్ దూరమయ్యాక చైతులో ఈ మార్పు మంచిదే !

Naga Chaitanya: నాగ చైతన్య మొదటి నుంచి చాలా సాఫ్ట్. అలాగే చాలా సైలెంట్. హీరోగా మంచి సక్సెస్ లు ఉన్నా.. చైతు పబ్లిసిటీ చేసుకోడు. పైగా హీరోలా కూడా బిహేవ్ చేయడు. సమంతతో పెళ్లి తర్వాత కూడా చైతులో మార్పు రాలేదు. అదేంటో.. సామ్ తో విడిపోయిన తర్వాత మాత్రం నాగ చైతన్య చాలా మారాడు. చైతులో ప్రస్తుతం చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో కూడా ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. […]

Written By:
  • Shiva
  • , Updated On : December 21, 2021 / 11:49 AM IST
    Follow us on

    Naga Chaitanya: నాగ చైతన్య మొదటి నుంచి చాలా సాఫ్ట్. అలాగే చాలా సైలెంట్. హీరోగా మంచి సక్సెస్ లు ఉన్నా.. చైతు పబ్లిసిటీ చేసుకోడు. పైగా హీరోలా కూడా బిహేవ్ చేయడు. సమంతతో పెళ్లి తర్వాత కూడా చైతులో మార్పు రాలేదు. అదేంటో.. సామ్ తో విడిపోయిన తర్వాత మాత్రం నాగ చైతన్య చాలా మారాడు. చైతులో ప్రస్తుతం చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో కూడా ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది.

    Naga Chaitanya Samantha

    పార్టీలకు దూరంగా ఉండే చైతు.. ప్రస్తుతం మిడ్ నైట్ పార్టీలతో ఫుల్ జోష్ లో ఉన్నాడట. పైగా ఆ పార్టీలకు సినీ ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నాడట. మరి చైతులో ఇలాంటి మార్పు రావడం నిజంగా విశేషమే. చైతు ముఖం సంతోషంతో వెలిగిపోతుందట. ఇంతకీ చైతు అంతలా మారిపోవడానికి గల కారణం మాత్రం తెలియలేదు. మరోపక్క కెరీర్ లోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు.

    ప్రస్తుతం వరుస కథలు వింటున్నాడు. దర్శకుడు సంపత్ నంది చైతుకి తాజాగా ఒక కథ చెప్పాడు. ఆ కథ చైతుకి కూడా బాగా నచ్చింది. సినిమా చేస్తానని కమిట్ అయ్యాడు. అలాగే వరుస కథలు వింటున్నాడు. చైతు ఇంత వేగంగా గతంలో ఎప్పుడు లేడు. పైగా తన కొత్త సినిమాల అప్ డేట్ పై సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేస్తున్నాడు.

    అసలు నాగ చైతన్య ఒకప్పుడు సోషల్ మీడియా అంటేనే చిరాకు పడేవాడు. సినిమా రిలీజ్ సమయంలో కూడా సోషల్ మీడియా ఎకౌంట్స్ ను వినియోగించడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. ఎంతో అవసరమైనప్పుడు మాత్రమే చైతు ట్వీట్ చేసేవాడు. కానీ ఇప్పుడు బాగా యాక్టివ్ గా ఉంటున్నాడు.

    Also Read: Bheemla Nayak Movie: సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న భీమ్లా నాయక్… రిలీజ్ ఎప్పుడంటే

    మొత్తమ్మీద చైతన్య తన సినిమాల ప్రొమోషన్ కోసం, తన అభిమానులతో టచ్ లో ఉండటానికి ట్విట్టర్ ని బాగా వాడటం మంచిదే. డైలీ ఏదొక పోస్ట్ పెడుతూ ఉంటే.. మీడియాలో కూడా చైతు యాక్టివ్ గా ఉన్నట్లు ఉంటుంది. ప్రస్తుతం చైతు ‘బంగార్రాజు’ సినిమాలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ల హడావుడి మొదలు పెట్టేశారు.

    Also Read: Shyam Singaroy: ఆ పాత్ర కోసం 15 గెటప్ లు ట్రై చేశా: నాని

    Tags