https://oktelugu.com/

Akhil Akkineni: అఖిల్ పాన్ ఇండియా మోజు.. నాగ్ చేస్తాడా ?

Akhil Akkineni:  అఖిల్ అక్కినేనికి ప్రస్తుతం పాన్ ఇండియా మోజు పట్టుకుంది. అదేంటి ఇంతవరకు తెలుగులోనే అఖిల్ కి సాలిడ్ హిట్ రాలేదు. ఇక పాన్ ఇండియా సినిమా ఏం వర్కౌట్ అవుతుంది ? అంటూ నిర్మాతలు పెదవి విరుస్తున్నా.. అఖిల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాన్ ఇండియా సినిమా చేయాల్సిందే అంటూ కూర్చున్నాడట. తనతో పాన్ ఇండియా అంటే బయట నిర్మాత రాడు కాబట్టి.. నాగార్జునను నిర్మాతగా సినిమా చేయమంటున్నాడట. అసలుకే నాగార్జున పక్కా బిజినెస్ […]

Written By: , Updated On : December 21, 2021 / 11:30 AM IST
Follow us on

Akhil Akkineni:  అఖిల్ అక్కినేనికి ప్రస్తుతం పాన్ ఇండియా మోజు పట్టుకుంది. అదేంటి ఇంతవరకు తెలుగులోనే అఖిల్ కి సాలిడ్ హిట్ రాలేదు. ఇక పాన్ ఇండియా సినిమా ఏం వర్కౌట్ అవుతుంది ? అంటూ నిర్మాతలు పెదవి విరుస్తున్నా.. అఖిల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాన్ ఇండియా సినిమా చేయాల్సిందే అంటూ కూర్చున్నాడట. తనతో పాన్ ఇండియా అంటే బయట నిర్మాత రాడు కాబట్టి.. నాగార్జునను నిర్మాతగా సినిమా చేయమంటున్నాడట.

Akhil Akkineni

Akhil Akkineni

అసలుకే నాగార్జున పక్కా బిజినెస్ మెన్. నష్టం వస్తోంది అంటే ఆ పని అస్సలు చేయడు. మరి ఇప్పుడు కొడుకు మీద ప్రేమతో నైనా నష్టం వచ్చే పని నాగ్ చేస్తాడా ? అంటూ విషయం తెలిసిన సినీ ప్రముఖులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, పాన్ ఇండియా సినిమా అంటే.. కనీసం వంద కోట్లు బడ్జెట్ అవుతుంది. అసలు అఖిల్ సినిమా ఇంతవరకు 50 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు.

అలాంటిది వంద కోట్లు ఎలా పెట్టుబడి పెట్టగలరు ? కాకపోతే గుడ్డిలో మెల్ల లాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకి 48 కోట్లు వచ్చాయి. కాకపోతే థియేటర్స్ నుంచి ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. కానీ రీసెంట్ గ ఈ చిత్రం ఆహా యాప్ లో విడుదలైంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ ను సాధించి ఒక రికార్డ్ ను సృష్టించుకుంది.

Also Read: Bheemla Nayak Movie: సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న భీమ్లా నాయక్… రిలీజ్ ఎప్పుడంటే

నిజానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కి థియేటర్స్ లో పెద్ద విజయం దక్కలేదు. కొన్ని ఏరియాల్లో అయితే, ఓపెనింగ్ రోజే జనం లేరు. అలాంటి సినిమాకు రెండు రోజుల్లోనే 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ అంటే గ్రేటే. పైగా ప్రస్తుతం ఈ సినిమాకు 150 మిలియన్ మినిట్స్ వ్యూయర్ వ్యూస్ వచ్చిందట. మొత్తమ్మీద అఖిల్ సినిమా ఓటిటిలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అన్నట్టు ఆ 150 మిలియన్ల వ్యూస్ చూపించే పాన్ ఇండియా సినిమా చేయమంటున్నాడట.

Also Read: Shyam Singaroy: ఆ పాత్ర కోసం 15 గెటప్ లు ట్రై చేశా: నాని

Tags