Adhi : మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఉన్న ఈ కుర్రాడు.. ఓ స్టార్ హీరో కొడుకు.. ఇతను కూడా ఇప్పుడు స్టారే.. ఎవరో చెప్పుకోండి..

కన్నడ పరిశ్రమకు చెందిన స్టార్ హీరో అయినా.. ఆయన తెలుగులో లెజెండ్ యాక్టర్ అనిపించుకున్నాడు. తన డైలాగ్ తో రోమాలు నిక్కబొడిచేలా చేశాడు. ఒక పోలీస్ ఆఫీసర్ కు ఎలాంటి ఆవేశం ఉంటుందో ఆయనను చూస్తే తెలుస్తుంది.. అన్నట్లుగా నటించారు. ఆయన ఎవరో కాదు సాయికుమార్. ఒకప్పుడు చిన్న చితకా పాత్రల్లో నటించిన సాయికుమార్ ఆ తరువాత ‘పోలీస్ స్టోరీ’ సినిమాతో సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరో అయ్యారు.

Written By: Srinivas, Updated On : July 31, 2024 3:13 pm
Follow us on

Adhi :  తెలుగు చిత్ర పరిశ్రమలోకి వారసులు రావడం అనాదిగా వస్తోంది. అలనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్ ల వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ కొనసాగుతున్నారు. అయితే వీరిలో కొందరు మాత్రమే నిలదొక్కుకొని స్టార్లు అయ్యారు. మిగతా వారు స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ తండ్రి స్టార్ హీరో అయితే ఆయన కొడుకు పరిశ్రమలోకి వచ్చి ఆయనలా స్టార్ కాలేకపోతున్నాడు. అయినా కొందరు సొంత టాలెంట్ తో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో కొందరు డైరెక్టర్లు కేవలం స్టార్ హీరోలని మాత్రమే కాకుండా కొత్త కొత్త హీరోలతో సినిమాలు తీస్తున్నారు. వీరిలో కొందరు వారసులు కూడా ఉన్నారు. అయితే ఇలా ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో కొందరు టాలెంట్ ఉన్నా.. ఒకటి, రెండు సినిమాలకే పరిమితమై ఆ తరువాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇక ఈ మధ్య కొందరు హీరోలు తమ చిన్న నాటి పిక్ లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు ఏదైనా సినీ పంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించేవారు. అలా ఓ సినీ పంక్షన్ కు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఓ స్టార్ హీరో కొడుకుకు ఎత్తుకొని ఫొటో దిగాడు. ఆ ఫొటోను భద్ర పరిచిన ఆ హీరో ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే ఈ పిక్ ఎవరిది? అని కొందరు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ చిరంజీవి చేతిలో ఉన్న ఈ బడ్డోడు ఎవరో తెలుసా?

కన్నడ పరిశ్రమకు చెందిన స్టార్ హీరో అయినా.. ఆయన తెలుగులో లెజెండ్ యాక్టర్ అనిపించుకున్నాడు. తన డైలాగ్ తో రోమాలు నిక్కబొడిచేలా చేశాడు. ఒక పోలీస్ ఆఫీసర్ కు ఎలాంటి ఆవేశం ఉంటుందో ఆయనను చూస్తే తెలుస్తుంది.. అన్నట్లుగా నటించారు. ఆయన ఎవరో కాదు సాయికుమార్. ఒకప్పుడు చిన్న చితకా పాత్రల్లో నటించిన సాయికుమార్ ఆ తరువాత ‘పోలీస్ స్టోరీ’ సినిమాతో సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరో అయ్యారు. ఆయన ఈ సినిమాలో వేసిన పోలీస్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సాయికుమార్ లా ఎంతో మంది పోలీస్ పాత్రల్లో నటించారు. కానీ సాయికుమార్ నటనను మాత్రం బీట్ చేయలేకపోయారు. ఈ సినిమా తరువాత సాయికుమార్ పలు సక్సెస్ చిత్రాల్లో నటించారు. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా నటించి మెప్పించాడు.

అయితే సాయికుమార్ కు గారాల కొడుకు ఆది ఉన్నారు. ఆయన ‘ప్రేమ కావాలి’ అనే సినిమాతో తెలుగు సినిమాలో ఎంట్రీ ఇచ్చారు. తన డెబ్యూ మూవీ సక్సెస్ కావడంతో ఇక తనకు తిరుగు లేదని అనుకున్నాడు. కానీ ఆ తరువాత ఆది చాలా సినిమాల్లో నటించారు. కానీ ఒక్కటీ బ్రేక్ ఇవ్వలేదు. అయితే హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా ఆది సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు. కొన్ని సినిమాల్లో తండ్రి సాయికుమార్ తో కూడా కనిపించాడు.

సినిమాల్లో తక్కువగా కనిపించినా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటాడు ఆది. లేటేస్టుగా ఆయన తన తండ్రి సాయికుమార్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఇక తాజాగా ఆయన చిన్న నాటి ఫొటో కూడా రిలీజ్ చేశాడు. ఈ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఉన్న ఆది సాయకుమార్ నే. ‘కలికాలం’ అనే సినిమా అవార్డు ఫంక్షన్లో మెగాస్టార్ హజరయ్యారు. ఈ సందర్భంగా సాయికుమార్ కొడుకును ఎత్తుకున్నప్పటి పిక్ ఇది. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.