Rave party : హైదరాబాద్ లో మరోసారి కలకలం రేపిన రేవ్ పార్టీ…పట్టుబడిన పలువురు సెలబ్రిటీలు… బిగ్ బాస్ ఫేమ్ అరెస్ట్..?

ఈ మధ్య ఎక్కడ చూసిన రేవు పార్టీలా పేరుతో యువత విచ్చలవిడిగా తిరుగుతూ వాళ్ళకి నచ్చిన విధంగా ప్రవర్తిస్తున్నారు... ఇక కొందరు సినిమా, టీవీ ఆర్టిస్టులు సైతం ఆ పార్టీలకు హాజరవుతున్నారు...

Written By: Gopi, Updated On : July 31, 2024 3:05 pm
Follow us on

Rave party :  సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం ప్రస్తుతం ఇక్కడ ఉన్న నటీనటులు అందరూ చాలా లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక వాళ్ళు సినిమా షూటింగ్ లు ఉన్న సమయంలో బిజీగా ఉంటూనే ఫ్రీ సమయంలో కొంత మంది పార్టీలు, పబ్ లు అంటూ చక్కర్లు కొడుతూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే ఇప్పుడున్న జనరేషన్ లోని కొంతమంది నటీనటులు ఎక్కువగా రేవు పార్టీలకు అట్రాక్ట్ అవుతున్నారు. నగర శివార్లలో ఈ రేవ్ పార్టీలను నిర్వహిస్తూ ఇక్కడ మద్యం అలాగే డ్రగ్స్ లాంటివి భారీ ఎత్తున తీసుకుంటూ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని మత్తులో కొంత మంది నటీ నటులు ఊగిపోతున్నారు. ఇక రీసెంట్ గా బెంగళూరులో జరిగిన రేవు పార్టీలో తెలుగు నటి అయిన హేమ దొరికిన విషయం మనకు తెలిసిందే. ఇక పోలీస్ విచారణలో పాల్గొన్న ఆమెకు సంభందించిన తుది తీర్పు రావాల్సి ఉంది…ఆ సంఘటన గడిచి రెండు నెలలు కాకముందే హైదరాబాద్ నగర శివారుల్లో జరిగిన మరొక రేవ్ పార్టీ కలకలం రేపుతుంది…అసలు విషయంలోకి వెళ్తే హైదరాబాద్ లోని మేడ్చల్ జిల్లాలో గల ఘట్కేసర్ నగరంలో రేవ్ పార్టీ ని నిర్వహించినట్టుగా తెలుస్తుంది… అందులో 10 లీటర్ల మద్యం , 10 బీర్ బాటిళ్లు దొరికాయి. ఇక ఈ రేవ్ పార్టీలో తెలుగు బిగ్ బాస్ షో ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న ‘మహబూబ్ షేక్’ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అతనితో పాటుగా కొంతమంది బుల్లితెర నటీనటులు కూడా ఈ రేవ్ పార్టీకి హాజరైనట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి.

ఇక పోలీసులు ఘటన స్థలంలో కొంతమందిని అరెస్ట్ చేసి ప్రస్తుతం వారి మీద విచారణ చేపడుతున్నారు…అలాగే ఈ రేవ్ పార్టీని నిర్వహించిన మేనేజర్లను సైతం అరెస్ట్ చేసి వాళ్ళ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అనే విధంగా ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు…ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన ఎవరో ఒకరు ఏదో ఒక రేవు పార్టీలో దొరుకుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పరువును తీస్తున్నారు. ఇక ఇలా చేస్తున్న కొంతమంది వల్ల ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పరువు పోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

మరి ఇలాంటి ఈ రేవు పార్టీలో పాల్గొన్న వారి పైన కఠిన చర్యలు తీసుకుంటేనే మరోసారి ఇలాంటి పార్టీలను నిర్వహించడానికి గాని దానికి అటెండ్ అవ్వడానికి కానీ ఎవరు పెద్దగా ఆసక్తి చూపించరు… లేకపోతే ప్రతి వారం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి… ఇక వీటిని అరికట్టాలంటే మాత్రం పోలీస్ వ్యవస్థ కఠిన చర్యలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితి అయితే నెలకొంది… ఇక గతంలో కూడా చాలామంది సెలబ్రిటీలు ఈ రేవ్ పార్టీ లకు అటెండ్ అయి చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు… రేవ్ పార్టీల ద్వారానే ఇప్పుడున్న యూత్ కూడా డ్రగ్స్ కి నిదానంగా అలవాటు పడుతున్నారు…

ప్రస్తుతం హైదరాబాదులో రేవ్ పార్టీలతో పాటు డ్రగ్స్ కూడా విపరీతం గా పెరిగిపోయింది…చాలామంది కాలేజీ పిల్లలు సైతం డ్రగ్స్ కి బానిసలుగా మారుతున్నారు. ఆ డ్రగ్స్ ని కొనడానికి కావలసిన డబ్బులను సంపాదించుకోవడానికి దొంగతనాలను కూడా చేస్తున్నారు. ఇక ఈ రేవు పార్టీలు, డ్రగ్స్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టి కొన్ని కఠిన చర్యలు చేపడితే బాగుంటుందంటూ సగటు జనాలు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…