https://oktelugu.com/

Guess Actress: నాగు పామును ధైర్యంగా పట్టుకున్న ఈ పాప ఓ స్టార్ కిడ్, మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్!

సినిమాలు ఎక్కువగా చూసే వాళ్లకు ఈ చిన్నప్పటి ఫోటో ఎవరిదో తెలిసిపోయే ఉంటుంది. అవును మీరు ఊహించింది కరెక్ట్... ఆమె మంచు లక్ష్మి. బాల్యం నుండే అమ్మడు గట్టి పిండం అని ఆ ఫోటో చూస్తే అర్థం అవుతుంది.

Written By:
  • Shiva
  • , Updated On : October 8, 2023 / 12:49 PM IST

    Guess Actress

    Follow us on

    Guess Actress: కొందరు పామును చూస్తేనే వణికిపోతారు. భయంతో పరుగులు పెడతారు. ఇక్కడ ఫొటోలో ఉన్న పాప పామును ఏదో ఆట వస్తువు లాగా పట్టుకుంది. ఆమె ముఖంలో ఎలాంటి భయం లేదు. ఈమె ఓ స్టార్ కిడ్. మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్. నిర్మాత కూడాను. హోస్ట్ గా తన మార్క్ వేసింది. సినిమాలు ఎక్కువగా చూసే వాళ్లకు ఈ చిన్నప్పటి ఫోటో ఎవరిదో తెలిసిపోయే ఉంటుంది. అవును మీరు ఊహించింది కరెక్ట్… ఆమె మంచు లక్ష్మి. బాల్యం నుండే అమ్మడు గట్టి పిండం అని ఆ ఫోటో చూస్తే అర్థం అవుతుంది.

    విలక్షణ నటుడు మోహన్ బాబు మొదటి సంతానం మంచు లక్ష్మి. మోహన్ బాబుకు ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్యకు మంచు లక్ష్మి, విష్ణు సంతానం. మంచు లక్ష్మి తల్లిగారు మరణించడంతో మోహన్ బాబు ఆమె చెల్లినే రెండో భార్యగా తెచ్చుకున్నాడు. రెండో భార్యకు మనోజ్ పుట్టాడు. నేడు మంచు లక్ష్మి పుట్టినరోజు. 1977 అక్టోబర్ 8న జన్మించిన మంచు లక్ష్మి 45వ ఏట అడుగుపెట్టింది.

    మంచు లక్ష్మి గొప్ప వ్యాఖ్యాత. ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలదు. అమెరికాలో ఆమె కొన్ని షోలకు హోస్ట్ గా వ్యవహరించారు. అలాగే మూడు ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు. యూఎస్ లోనే ఆమె కెరీర్ మొదలైంది. కారణం తెలియదు కానీ… టాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది తెలుగులో మంచు లక్ష్మి మొదటి చిత్రం అనగనగా ఓ ధీరుడు. ఆ మూవీ డిజాస్టర్. సిద్ధార్థ్-శృతి హాసన్ జంటగా నటించిన ఆ చిత్రంలో మంచు లక్ష్మి నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసింది.

    Guess Actress

    మంచు లక్ష్మి తెలుగులో కూడా కొన్ని టాక్ షోలకు హోస్ట్ గా చేశారు. ఆమె హీరోయిన్ గా ఎదిగే ప్రయత్నం కూడా చేసింది. దొంగాట, గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాల్లో ప్రధాన పాత్రలు చేసింది. అయితే ఆమె సక్సెస్ దక్కలేదు. శ్రీ, నేను మీకు తెలుసా?, ఝుమ్మంది నాదంతో పాటు పలు చిత్రాలు నిర్మించారు. ప్రస్తుతం ఆమె అగ్ని నక్షత్రం టైటిల్ ఓ చిత్రం చేస్తున్నారు. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ కాగా మోహన్ బాబు కీలక రోల్ చేస్తున్నారు. మంచు లక్ష్మి బర్త్ డే నేపథ్యంలో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.