https://oktelugu.com/

Diwali 2024: దీపావళి గురించి తెలియని విషయాలు.. నీటితో కూడా దీపాలు వెలిగించవచ్చు..

హిందువులు ఎంతో సంతోషంగా జరుపుకునే పెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. ఈ పండగ అంటే పిల్లలకు చాలా ఇష్టం కదా. ఎందుకంటే క్రాకర్స్ కాల్చుకోవచ్చు. ఎంజాయ్ చేయవచ్చు అనుకుంటారు. దీపావళి ఐదు రోజులు చేస్తారు చాలా మంది. ఇక ఆ తర్వాత కార్తీక మాసం కూడా వెంటనే ప్రారంభం అవుతుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : October 29, 2024 / 05:17 AM IST

    Diwali 2024(1)

    Follow us on

    Diwali 2024: కార్తీక మాసంలో కూడా నెల అంతా సాయంత్రం దీపారాధన చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం. అయితే దీపాలు వెలిగించడం ఎంత ముఖ్యమో.. అందులో ఉపయోగించే నూనెలు కూడా అంతే ముఖ్యం అంటున్నారు పండితులు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏదీ కొనలేని పరిస్థితి నెలకొంది. నూనెలు ధరలు కూడా బాగా పెరిగాయి. కేవలం నూనెతోనే కాకుండా దీపాలను నీటితో కూడా వెలిగించుకోవచ్చు. నీటితో వెలిగించిన దీపాలు ఎంతో ప్రకాశ వంతంగా వెలుగుతాయి అంటున్నారు నిపుణులు. అంటే మీకు ఆయిల్ కూడా చాలా తక్కువ అవసరం. డబ్బు ఆదా అవుతుంది. మరి వీటిని ఎలా వెలిగిస్తారు.

    నీటితో వెలిగించిన దీపాలు కూడా ఎక్కువు సేపు వెలుగుతూ ఉంటాయి. చిన్న టెక్నిక్స్ ఉపయోగిస్తే కొద్దిగా నూనెతో దీపాలను వెలిగించవచ్చు. ముందుగా మీకు కావాల్సిన వత్తులను ఆయిల్‌లో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని దీపాల్లో పెట్టాలి. ప్రమిదలో నీరు 80 శాతం వరకు వేయండి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ తీసుకుని.. ఆ నీటిలో వేయండి. ఆ తర్వాత దీపం వెలిగించండి. ఇలా చేస్తే నల్ల మరకలు కూడా పడకుండా ఉంటాయి. ఈ ట్రిక్ ఎంతో చక్కగా ఉపయోగ పడుతుంది.

    దీపావళి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

    1. దేశవ్యాప్తంగా జరుపుకునే వేడుక దీపావళి. ఇది కేవలం హిందూ పండుగగా భావిస్తారు.. సిక్కులు, జైనులు కూడా దివాళీ ఘనంగా జరుపుకుంటారు.

    2. దీపావళి అంటే ఆ రోజు బాణసంచా కాల్చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? కానీ.. ఇది ఐదు రోజుల పండుగ ఇది. ధనత్రయోదశి, నరకచతుర్థశి, దీపావళి, బలిపాడ్యమి, భాయ్ దూజ్. ఏటా ఈ పండుగలు ఒకే తేదీకి రావు.. చంద్రుడి స్థానాన్ని బట్టి వస్తుంటాయి.

    3. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. ఈ పండుగ సందర్భంగా ప్రజలంతా ఇంటి ముందు దీపాల వరుసతో నింపేస్తారు..అందుకే దీపావళి అనే పిలుస్తారు

    4. దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ చాలా ప్రత్యేకం. దక్షిణాదిన సంక్రాంతి ఎంత పెద్ద పండుగగా జరుపుకుంటారో ఉత్తరాదిన కూడా ప్రజలు అంతే ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు లక్ష్మీపూజ చేయడం చాలా విశేషం. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోనూ లక్ష్మీపూజ చేస్తున్నారు. దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం , ఆనందం ఉంటుందని విశ్వసిస్తారు.

    5. చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా జరుపుకునే దీపావళి వెనుక ఎన్నో ఇతిహాసాలున్నాయి. ఉత్తర భారతదేశంలో… రావణ సంహారం తర్వాత రాముడు అయోధ్యకు తిరిగొచ్చారు. దీపావళి రోజు అమావాస్య కావడంతో దీపాలు వెలిగించి బాణాసంచా వెలుగులతో అయోధ్యను నింపేవేశారు..