OG Movie OTT Release: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. మొదటి వీకెండ్ లోనే 252 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, రాబోయే రోజుల్లో 400 కోట్ల గ్రాస్ ని రాబడుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు అభిమానులు. వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 166 కోట్ల రూపాయలకు జరిగింది. రిటర్న్ GST తో కలిపి 174 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ నెంబర్ ని ఈ చిత్రం అందుకోవాల్సి ఉంది. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఈ సినిమాకు నాలుగు రోజుల్లో 142 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రిటర్న్ GST తో కలిపి వచ్చాయి. మరో రెండు మూడు రోజుల్లో మిగిలిన కలెక్షన్స్ ని కూడా రాబట్టి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని బలమైన నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా 120 కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగింది. ఈ డీల్ కోసం నిర్మాత దానయ్య నార్త్ ఇండియా లో నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ లో కూడా విడుదల ఆపెసుకున్నాడు. నెట్ ఫ్లిక్స్ సంస్థ తో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమాని నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. అంటే ఈ నెలాఖరున ఈ సినిమా మనకు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది అన్నమాట. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రేంజ్ ర్యాంపేజ్ వేస్తున్న ఈ చిత్రం, అంత తొందరగా వస్తే కలెక్షన్స్ చాలా నష్టపోతాం కదా అని సోషల్ మీడియాలో అభిమానులు అంటున్నారు.
కానీ ఒకవేళ థియేటర్స్ లో ఈ చిత్రానికి అప్పటి వరకు థియేట్రికల్ రన్ ఉంటే నిర్మాతలు రిక్వెస్ట్ చేసుకొని మరికొన్ని రోజులు ఓటీటీ విడుదల ని వాయిదా వేయించే అవకాశం ఉంటుంది. థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ కంటే, ఈ చిత్రానికి ఓటీటీ ఓ వచ్చే రెస్పాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఇలాంటి సినిమాలను హిందీ ఆడియన్స్ ఒక రేంజ్ లో ఆదరిస్తారని, తద్వారా ఓజీ సీక్వెల్ పై అంచనాలు అమాంతం పెరిగిపోతాయని అంటున్నారు. మరి ఆ రేంజ్ కి ఈ చిత్రం చేరుకుంటుంది లేదా అనేది చూడాలి.