Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నవారు మాత్రమే సక్సెస్ లను సాధిస్తారు. సక్సెస్ లు దక్కిన వారికే ఎక్కువ మార్కెట్ క్రియేట్ అవుతోంది. ప్రేక్షకులు సైతం వాళ్లని ఆదరించడానికి ఆసక్తి చూపిస్తారు. కాబట్టి సక్సెస్ఫుల్ సినిమాలు చేసినవారు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ రోజుల పాటు కొనసాగుతారు. లేకపోతే మాత్రం వాళ్ళు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఇలాంటి క్రమంలోనే యంగ్ హీరో అయిన కిరణ్ అబ్బవరం సైతం వరుసగా సక్సెస్ లను సాధిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన ‘కే ర్యాంప్’ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్ అవ్వడం చూసిన కొంతమంది సినిమా పెద్దలు అతన్ని ఎలాగైనా సరే డౌన్ ఫాల్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకని అతన్ని టార్గెట్ చేశారు అనే విషయాల్లో క్లారిటీ లేదు కానీ కొంతమంది అతని సినిమా కెరియర్ మీద దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కథనాలైతే వెలువడుతున్నాయి.
Also Read: రవితేజ వల్లే మా తమ్ముడు కార్తీ కెరియర్ నిలబడింది : సూర్య…
ఇక కిరణ్ అబ్బవరం ఇప్పుడు వరుసగా డిఫరెంట్ సినిమాల్లో చేస్తూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి తను ఇకమీదట కూడా మంచి సక్సెస్ లను సాధిస్తాడు అంటూ అతని అభిమానులు కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు.అలాగే మంచి కాన్సెప్ట్ లతో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న వాళ్ళని ఎవ్వరు తొక్క లేరని వాళ్లకు ఒక సెపరేట్ స్టైల్ ఉంటుందని చెబుతున్నారు.
ఇక సినిమాల ఎంపిక విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఆయన సినిమా ఏ మాత్రం తేడా కొట్టిన కూడా దానిమీద నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆ సినిమాను విమర్శకులు సైతం చీల్చి చెండాడే ప్రయత్నం చేస్తున్నారు…
ప్రస్తుతం కిరణ్ అబ్బవరం శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడుకున్న సినిమాగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…