ఒక పక్క అన్ సీజన్, మరో పక్క కరోనా ఎఫెక్ట్. ఈ రెండింటి మధ్య చలన చిత్ర పరిశ్రమ చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంది. కలెక్షన్లు లేక సినిమా హాళ్లు వెల వెల బోయాయి.అలాంటి స్థితిలో కూడా ఈ ఉపద్రవాల్ని అధిగమించి 3 సినిమాలు మంచి సక్సెస్ సాధించి గాఢాంధకారంలో కాంతి కిరణాలు గా తెలుగు సినీ రంగానికి వెలుగుని ప్రసాదించాయి. వాటిలో మొదటిది నితిన్, రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం ‘భీష్మ’.
గత ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని మొదటి వారం పూర్తయ్యేసరికే బ్రేక్ ఈవెన్ సాధించింది. వరుసగా 3 ప్లాప్ లతో సతమతమవుతోన్న నితిన్ ఈ చిత్రంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు.. అయితే ఈ చిత్రం ఓపెనింగ్స్ ను చూసి కచ్చితంగా.. నితిన్ కెరీర్ బెస్ట్ చిత్రం అయిన “‘అ ఆ’” మూవీ కలెక్షన్లను అధిగ మిస్తుంది అని కూడా అంతా అనుకొన్నారు. కానీ పరిస్థితులు అనుకూలించ లేదు. అయితే ఈ గడ్డు పరిస్థితుల్లో ఒడ్డున పడి బయ్యర్లకు ఆనందాన్ని ఇచ్చింది.నిజానికి భీష్మ’ చిత్రానికి 22.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 20 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 28.30 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. దాంతో ఈ చిత్రం కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టారు.
ఇక ఇదే గడ్డు కాలంలో మరో చిన్న చిత్రం కూడా బయ్యర్లకు లాభాల్ని తెచ్చి పెట్టింది. విశ్వక్ సేన్, రుహాని శర్మ జంటగా ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై నేచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిరినేని కలిసి నిర్మించిన ‘హిట్’ చిత్రం ఫిబ్రవరి 28న విడుదలైంది. కాగా ఈ సినిమాని లో బడ్జెట్ లోనే తెరకెక్కించడంతో… మొదటి 3 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి.. టైటిల్ కు తగినట్టుగానే ‘హిట్’ మూవీ అనిపించు కొంది..
నిజానికి ‘హిట్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 13 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 7.07 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో ఈ చిత్రం కొన్న బయ్యర్స్ అందరూ లాభాల బాట పట్టారు. అయితే కరోనా వైరస్ భయంతో చాలా మంది థియేటర్లకు రావడం మానేసారు లేకపోతే ఈ చిత్రం మరింతగా కలెక్ట్ చేసేది.
ఇక ఈ రెండు చిత్రాలతో బాటు మార్చ్ ఆరవ తారీఖున విడుదలైన అనువాద చిత్రం కనులు కనులను దోచాయంటే చిత్రం కూడా మౌత్ టాక్ తో రెండో వారంలో థియేటర్ల సంఖ్యను పెంచుకొని బయ్యర్లకు లాభాల్ని తెచ్చి పెడుతోంది.
Luck has no barriers