‘వకీల్ సాబ్’తో గోవా బ్యూటీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’. బాలీవుడ్లో సూపర్ హిట్టు సాధించిన ‘పింక్’ మూవీని తెలుగులో ‘వకీల్ సాబ్’గా దిల్ రాజు, శ్రీదేవి భర్త బోనికఫూర్ నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని త్వరగా పూర్తి చేసి వేసవిలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. కాగా ఈ మూవీలో పవన్ జోడీగా గోవా సుందరీ ఇలియానా నటించనుందనే […]

Written By: Neelambaram, Updated On : March 13, 2020 10:18 am
Follow us on

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’. బాలీవుడ్లో సూపర్ హిట్టు సాధించిన ‘పింక్’ మూవీని తెలుగులో ‘వకీల్ సాబ్’గా దిల్ రాజు, శ్రీదేవి భర్త బోనికఫూర్ నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని త్వరగా పూర్తి చేసి వేసవిలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. కాగా ఈ మూవీలో పవన్ జోడీగా గోవా సుందరీ ఇలియానా నటించనుందనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

గతంలో పవన్-ఇలియానా కాంబినేషన్లో ‘జల్సా’మూవీ వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘జల్సా’ అప్పట్లో రికార్డులను సృష్టించింది. తాజాగా మరోసారి పవన్ సరసన ఇలియానా నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. ‘జల్సా’ మూవీ తర్వాత ఇలియానా స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడే సినిమాలు చేస్తోంది. తాజాగా ఈ అమ్మడికి బాలీవుడ్లో అవకాశాలు తగ్గడంతో మళ్లీ టాలీవుడ్ వైపు చూస్తుంది. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఇలియానాను ‘వకీల్ సాబ్’ రూపంలో బంపర్ ఆఫర్ వచ్చింది.

‘వకీల్ సాబ్’ మూవీలో ఇప్పటికే నివేథా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా పవన్ కు జోడీగా ఇలియానా ఎంపికకావడంతో అభిమానులు ‘జల్సా’ చేసుకుంటున్నారు. ఇటీవల ‘వకీల్ సాబ్’ ఫస్టు లుక్, టీజర్, సాంగ్స్ విడుదలై అభిమానులను ఆకట్టుకున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా విడుదలైన ‘మగువా.. మగువా’ యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తుంది. గతంలో ‘వకీల్ సాబ్’లో శృతిహాసన్ నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఇలియానా పేరు తెరపైకి వచ్చింది. అయితే చిత్రబృందం దీనిపై అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.