Rajamouli:’స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ‘రాజమౌళి’ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలతో మాస్ ఇమేజ్ సంపాదించుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక ఆ తర్వాత బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు చేసి ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా మారాడు. ప్రస్తుతం పాన్ వరల్డ్ లోకి ఎంటర్ ఇస్తున్న రాజమౌళి ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…ప్రస్తుతం ఉన్న రోజులను బట్టి చూస్తే రాజమౌళిని టచ్ చేసి దర్శకుడు మరెవరు లేరు అనేది వాస్తవం. కారణం ఏంటి అంటే ఆయన ఒక సినిమా కోసం చాలా కష్టపడతాడు. కాబట్టి ఈరోజుల్లో ఆయనను అందుకోవడం అనేది చాలా కష్టమని చాలా మంది సినిమా మేధావులు చెబుతున్నారు. నిజానికి రాజమౌళి ని బీట్ చేయాలనుకునే దర్శకులకు ఒక మూడు క్వాలిటీస్ అయితే ఉండాలని మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం…
ఇంతకీ ఆ కారణాలు ఏంటి అంటే సినిమా కోసం బాగా కష్టపడాలి. కథ మీద చాలా కేర్ తీసుకోవాలి, ఎన్ని అడ్డంకులు వచ్చిన తను ఏ కథనైతే తీయాలనుకుంటున్నారో దానిమీదే స్టాండై ఉండి అదే కథని తెరమీద చూపించే ప్రయత్నం చేయాలి. ఈ మూడు లక్షణాలు కనక ఒక దర్శకుడి లో ఉంటే మాత్రం ఆ దర్శకుడు రాజమౌళిని ఈజీగా బీట్ చేయొచ్చు అంటూ మరి కొంతమంది చెబుతూ ఉండడం విశేషం…
మరి ఏది ఏమైన కూడా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ని ఇప్పుడు అందుకోవడం చాలా కష్టమైన పని అయిన డైరెక్ట్ గా పాన్ వరల్డ్ లోకి ఎంటర్ ఇస్తున్నాడు. కాబట్టి జేమ్స్ కామెరూన్ లాంటి స్టార్ డైరెక్టర్ల పక్కన తన స్థాయిని నిలుపుకోవాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడు.
తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో భారీ విజయాలను సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…చూడాలి మరి ఇప్పుడు చేస్తున్న మహేష్ బాబు సినిమాతో ఎన్ని వండర్స్ ని క్రియేట్ చేస్తాడు ఏ రేంజ్ లో వసూళ్లను కలెక్ట్ చేస్తాడు అనేది…