Tollywood: మన స్టార్ హీరోలు చేసే చాలా సినిమాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను క్రియేట్ చేస్తు ఉంటాయి. ముఖ్యంగా ఒక సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ గాని, టీజర్ గాని వచ్చిందంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే పెరుగుతాయి. అలాంటి సందర్భంలోనే ఒక సినిమా ట్రైలర్ ని చూసిన అభిమానులు ఆశ్చర్యానికి గురై సినిమాలో వాళ్ళ హీరో చేసే మ్యాజిక్ ను చూడ్డానికి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే కొన్ని సినిమాల ట్రైలర్లు అద్భుతంగా ఉండి ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ ను క్రియేట్ చేస్తాయి. కానీ తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత అది డిజాస్టర్ అని తెలిసి ప్రేక్షకులు డిస్సాపాయింట్ అవుతూ ఉంటారు. అలా భారీ హైప్ తో వచ్చి ప్రేక్షకులను మెప్పించ లేకపోయిన సినిమాలు ఏంటో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కబాలి
రజినీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘కబాలి ‘ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచింది. ముఖ్యంగా టీజర్ లో రజినీకాంత్ తన మ్యానరిజంతో అద్దరగొట్టడంతో ఈ సినిమా మీద అప్పటినుంచి ప్రేక్షకుల్లో అంచనాలు అయితే భారీ గా పెరిగాయి. ఇక ఆ తర్వాత ట్రైలర్ తో అంచనాలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే అందులో మ్యాటర్ ఏమీ లేకపోవడంతో సినిమా డిజాస్టర్ అయ్యింది…
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా…
అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది. ఇక టీజర్ తో ఈ సినిమా ఒక్కసారిగా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచేసింది. ఇక దానికి తగ్గట్టుగానే ట్రైలర్ లో కూడా దేశభక్తి ని చూపిస్తూ రిలీజ్ చేశారు. అభిమానులు సినిమా హై రేంజ్ లో ఉండబోతుందని ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ వాళ్ళ అంచనాలన్నింటిని తారు మారు చేస్తూ ఈ సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది…