https://oktelugu.com/

Movie Sequels: 2022లో రాబోయే మూవీ సిక్వెల్స్ ఇవే..!

Movie Sequels: ఓ సినిమా హిట్టయితే దానికి సిక్వల్ తెరకెక్కించడం ఇటీవలీ కాలంలో చాలా కామన్ అయిపోయింది. తెలుగులో ఇప్పటికే పలు సిక్వెల్ అంకుర దశలో ఉండగా మరికొన్ని రిలీజుకు రెడీ ఉండటం విశేషం. దీంతో 2022లో రాబోతున్న మూవీ సిక్వెల్ తెలుసుకునేందుకు సినీప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి..! విక్టరీ వెంకటేష్-వరుణ్ తేజ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘ఎఫ్-2’ సినిమా సూపర్ హిట్టయింది. ఈ మూవీ సిక్వెల్ గా ‘ఎఫ్-3’ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 18, 2022 / 12:34 PM IST
    Follow us on

    Movie Sequels: ఓ సినిమా హిట్టయితే దానికి సిక్వల్ తెరకెక్కించడం ఇటీవలీ కాలంలో చాలా కామన్ అయిపోయింది. తెలుగులో ఇప్పటికే పలు సిక్వెల్ అంకుర దశలో ఉండగా మరికొన్ని రిలీజుకు రెడీ ఉండటం విశేషం. దీంతో 2022లో రాబోతున్న మూవీ సిక్వెల్ తెలుసుకునేందుకు సినీప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి..!

    విక్టరీ వెంకటేష్-వరుణ్ తేజ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘ఎఫ్-2’ సినిమా సూపర్ హిట్టయింది. ఈ మూవీ సిక్వెల్ గా ‘ఎఫ్-3’ రాబోతుంది. 2022 ఫిబ్రవరి 25న ‘ఎఫ్-3’ రిలీజు చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తోంది.

    యశో హీరోగా నటించిన ‘కేజీఎఫ్’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెల్సిందే. ఈ మూవీ సిక్వెల్ గా ‘కేజీఎఫ్-2’ రాబోతుంది. ఈ మూవీని ఏప్రిల్ 14న రిలీజు చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

    విశ్వక్ సేక్ హీరోగా నటించిన ‘హిట్’ మూవీ బాక్సాఫీస్ వద్ద గతంలో ఘన విజయం సాధించింది. ఈ మూవీకి సిక్వెల్ ‘హిట్-2’ రాబోతుంది. ఇందులో అడవి శేష్ కీలక పాత్రలో కన్పించనున్నాడు.

    నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తీకేయ’ మూవీ సిక్వెల్ గా ‘కార్తీకేయ-2’ రానుంది. ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందనే ధీమాను హీరో నిఖిల్ వ్యక్తం చేస్తున్నాడు. మంచు విష్ణు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా ‘ఢీ’ మూవీ నిలిచింది. ఈ సినిమాకు సిక్వెల్ గా ‘డీ డబుల్ డోస్’ రానుంది.

    అల్లు అర్జున్ నటించిన ‘పుష్ఫ’కు పార్ట్-2 త్వరలోనే రానుంది. ‘ఫుష్ప ది రూలర్’ పేరుతో దర్శకుడు సుకుమార్ ఈ సినిమా సిక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నాడు. అలాగే అడవి శేష్ ‘గుఢచారి’కి సిక్వెల్ గా ‘గుఢచారి2’ రానుంది.