https://oktelugu.com/

OTT Movies: ఈ వారం ఓటిటి లో సందడి చేయబోతున్న టాప్ సినిమాలు సిరీస్ లు ఇవే…

ఖాబర్ సీజన్ 2 కూడా ఓటిటి లోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది...ఇక జేడి చక్రవర్తి, భువన్ బామ్, శ్రియ పిల్గావర్ కలిసి నటించిన ఈ సిరీస్ కూడా చాలా మంచి పేరు సంపాదించుకుంది. ఇక రెండో సీజన్ కూడా ప్రేక్షకులను అలరించడానికి ఈనెల 27 వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వడానికి రెఢీ అవుతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : September 25, 2024 / 02:47 PM IST

    OTT Movies(1)

    Follow us on

    OTT Movies: ప్రస్తుతం ఓటిటి ఫార్మాట్ అనేది భారీ రేంజ్ లో విస్తరిస్తుంది. ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఓటిటి ద్వారా సినిమాలను చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఓటిటి ఫ్లాట్ ఫామ్ ద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని సినిమాలను ప్రతి ప్రేక్షకులు చూస్తూ ఆ సినిమాల ద్వారా ఎంటర్ టైన్ అవుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఓటిటి ప్లాట్ ఫామ్ కి ఈ వారంలో భారీ ఎత్తున సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. ఇక వీటిలో కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులందరిలో అటెన్షన్ ని క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాల కోసం ఓటిటి ప్రేక్షకులు చాలా ఈగరుగా వెయిట్ చేస్తున్నారు. అందులో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన ‘సరిపోదా శనివారం’ సినిమాను చూడడానికి ఓటిటి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఈనెల 26వ తేదీన ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది…ఇక థియేటర్లో భారీ సక్సెస్ ను సాధించిన ఈ సినిమా కూడా భారీ వ్యూయర్ షిప్ ని సంపాదించుకోవడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికైతే ఈ సినిమాతో నాని మరొకసారి తన సత్తా చాటాడనే చెప్పాలి…

    ఇక ఈ సినిమాతో పాటుగా ఖాబర్ సీజన్ 2 కూడా ఓటిటి లోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది…ఇక జేడి చక్రవర్తి, భువన్ బామ్, శ్రియ పిల్గావర్ కలిసి నటించిన ఈ సిరీస్ కూడా చాలా మంచి పేరు సంపాదించుకుంది. ఇక రెండో సీజన్ కూడా ప్రేక్షకులను అలరించడానికి ఈనెల 27 వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వడానికి రెఢీ అవుతుంది…

    ఇక వీటితోపాటుగా శోభిత ధూళిపాళ్ల నటించిన ‘లవ్ సితార’ సినిమా కూడా ఈనెల 27వ తేదీన డైరెక్ట్ గా ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన జీ5 లో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ అవుతుంది…

    ఇక ఇవే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన ‘వాళ్లై ‘ మూవీ కూడా ఈనెల 27వ తేదీన జీ 5 లో స్ర్మింగ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇక మారి సెల్వరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. థియేటర్లో మంచి సక్సెస్ ను సాధించిన ఈ సినిమా ఓటిటి లో కూడా భారీ సక్సెస్ ని సాధిస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు…ఇక వీటితో పాటు గా హార్రర్ థ్రిల్లర్ మూవీ అయిన డిమోట్ కాలనీ మూవీ కూడా ఈనెల 27 వ తేదీన జీ 5 లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది…