Top 5 contestants of Bigg Boss 9: భారీ అంచనాల నడుమ మొదలైన ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) కనీవినీ ఎరుగని బ్లాక్ బస్టర్ టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతూ 12 వ వారం లోకి అడుగుపెట్టింది. 23 మంది తో మొదలైన ఈ బిగ్ బాస్ షో, ఇప్పుడు 9 మందికి చేరింది. గత వారం దివ్య ఎలిమినేట్ అవ్వాలి కానీ, గొడవల కోసం, టీఆర్ఫీ రేటింగ్స్ కోసం ఎలిమినేషన్ ని రద్దు చేశారు. ఇప్పుడు ఈ 9 మంది కంటెస్టెంట్స్ లో ఎవరు టాప్ 5 గా మిగలబోతున్నారు అనేది ఆసక్తి కరంగా మారింది. అందరూ అనుకున్నట్టు గానే ఈ సీజన్ లో అత్యధిక ఓటింగ్ తో మొదటి వారం నుండి డామినేట్ చేస్తూ వస్తున్న కంటెస్టెంట్ తనూజ. ‘ముద్ద మందారం’ లాంటి బ్లాక్ బస్టర్ సీరియల్ గతం లో ఆమె చేయడం వల్ల, ఆమెకు హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి భారీ ఫ్యాన్ బేస్ ఉంది.
ఆ ఫ్యాన్ బేస్ ని ఏ మాత్రం తిరగకుండా కాపాడుకుంటూ వచ్చింది తనూజ. హాట్ స్టార్ లోని ఫ్యాన్ జోన్ లో ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం తనూజ కి 51.6 శాతం ఓట్లు నమోదు అయ్యింది. ఇది మామూలు ర్యాంపేజ్ కాదు. తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో ఒక లేడీ కంటెస్టెంట్ తన తోటి కంటెస్టెంట్స్ పై ఈ రేంజ్ డామినేషన్ ఓటింగ్ లో చూపించడం ఇప్పటి వరకు జరగలేదు. ఆమె తర్వాత రెండవ స్థానం లో పవన్ కళ్యాణ్ 18.4 శాతం ఓటింగ్ తో కొనసాగుతున్నాడు. మొదటి మూడు వారాలు ఇతని లో ఎలాంటి గేమ్ కనిపించలేదు. అతి తక్కువ ఓట్లతో ఎలిమినేట్ అవ్వడానికి డేంజర్ జోన్ వరకు కూడా వచ్చాడు. కానీ అదృష్టం కలిసి రావడం, వరుసగా పాజిటివ్ ఎపిసోడ్స్ పడడం వల్ల ఇతని స్థానం పదిలం అయ్యింది. ఇక ఆ తర్వాత మూడవ స్థానం లో ఇమ్మానుయేల్ కొనసాగుతున్నాడు.
ఇతను ప్రతీ వారం నామినేషన్స్ లోకి వస్తూ ఉండుంటే కచ్చితంగా ఇతని ఓటింగ్ వేరే లెవెల్ ఉండేది. కానీ ఇప్పుడు ఈయన విన్నర్ రేస్ కి చాలా దూరంగా కేవలం 14 శాతం ఓటింగ్ తో మూడవ స్థానం లో కొనసాగుతున్నాడు. ఇక నాల్గవ స్థానం లో భరణి 5.9 శాతం ఓటింగ్ తో కొనసాగుతుండగా, 5.7 శాతం ఓటింగ్ తో డిమోన్ పవన్ 5 వ స్థానం లో కొనసాగుతున్నాడు. హాట్ స్టార్ లో జరుగుతున్న ఓటింగ్ ప్రకారం చూస్తే టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే. రీతూ చౌదరి ఓటింగ్ బాగా పెరిగింది, ఆమె టాప్ 5 లో ఉంటుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఆమెకు అసలు ఓటింగ్ పడట్లేదు. దివ్య కి మూడు శాతం ఓటింగ్ నమోదు అయితే రైతు చౌదరి కి 1.4 శాతం ఓటింగ్ మాత్రమే నమోదు అయ్యింది.