Devara 2 cancelled: #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) కొరటాల శివ తో కలిసి చేసిన చిత్రం ‘దేవర’. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం నందమూరి అభిమానులకు ఒక మధురమైన జ్ఞాపకం. మొదటి రోజు నుండి క్లోజింగ్ వరకు బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్టీఆర్ సత్తా చూపిన సినిమా. ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన పాజిటివ్ టాక్ ఏమి రాలేదు. డివైడ్ టాక్ వచ్చింది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా ఉండడం, ఒక్కో పాట సెన్సేషనల్ హిట్ అవ్వడం వల్ల ఈ సినిమా జనాల్లోకి బలంగానే వెళ్ళింది. ఈ చిత్రానికి పార్ట్ 2 కూడా కచ్చితంగా ఉంటుందని దేవర క్లైమాక్స్ లో క్లిఫ్ హ్యాంగర్ లాగా ఒకటి పెడుతాడు డైరెక్టర్ కొరటాల. దేవర ని కన్న కొడుకు వర ఎందుకు చంపాడు అనే లైన్ మీద రెండవ భాగం ఉంటుంది అని ఆడియన్స్ కి అర్థం అయ్యేలా చేసాడు డైరెక్టర్.
అయితే ఈ పాయింట్ పై ఎన్టీఆర్ అభిమానుల్లో కానీ, మామూలు ఆడియన్స్ లో ఎలాంటి ఆసక్తి లేదు. అసలు దేవర కి సీక్వెల్ అవసరమే లేదు, అంత పెద్ద స్టోరీ అందులో లేదు అని అభిమానుల అభిప్రాయం కూడా. కానీ కొరటాల శివ మాత్రం ‘దేవర’ ఒక చిన్న టీజర్ లాంటిది మాత్రమే, సీక్వెల్ లో ఎన్నో సర్ప్రైజ్ లు, ట్విస్టులు ఉన్నాయని, అసలైన కథ సీక్వెల్ లోనే ఉందని చెప్పుకొచ్చాడు కొరటాల శివ. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కాస్త ఆసక్తి మొదలైంది. కచ్చితంగా ఈ సినిమా వర్కౌట్ అవుతుందని అనుకున్నారు. అంతే కాకుండా స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా దేవర సీక్వెల్ ఉంటుంది, ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి అవ్వగానే దీన్ని మొదలు పెడుతాము అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే, ‘దేవర 2’ రద్దు అయ్యిందని. రీసెంట్ గానే ఎన్టీఆర్ కొరటాల శివ ని తన ఇంటికి పిలిచి, ఈ ప్రాజెక్ట్ మనకు వర్కౌట్ అవ్వదు, వేరే కథ ఏమైనా ఉంటే, వేరే హీరో తో చేసుకో అని చెప్పేశాడట. దీంతో కొరటాల శివ పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రస్తుతం కొరటాల కి స్టార్ హీరోలు అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు. మీడియం రేంజ్ హీరోలు, సీనియర్ హీరోలు కొరటాల తో సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ కొరటాల ద్రుష్టి మాత్రం పాన్ ఇండియన్ హీరోల మీద మాత్రమే ఉంది. వాళ్ళ స్టాండర్డ్స్ కి అయితే ప్రస్తుతం కొరటాల సరిపోడు అనేది వాస్తవం. ఇక కొరటాల కూడా నాగ చైతన్య, లేదా నందమూరి బాలకృష్ణ లతో సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటూ టాక్ వినిపిస్తోంది. ఇది ఎంత వరకు నిజమో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.