Top Tollywood stars Instagram: సోషల్ మీడియా లో ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్(Instagram) ని మించిన పవర్ ఫుల్ మీడియం మరొకటి లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఎంటెర్టైమెంట్ రంగం ఇన్ స్టాగ్రామ్ ప్రభావం మామూలు రేంజ్ లో లేదనే చెప్పాలి. ఒక సినిమా కి బంపర్ ఓపెనింగ్స్ రావడానికి కారణం ఇన్ స్టాగ్రామ్. ఒక పాట సూపర్ హిట్ అవ్వాలి, దానిపై ఆర్గానిక్ గా ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ పడాలి. అవి బాగా వైరల్ అయితే సినిమా పై హైప్ పెరుగుతుంది, ఓపెనింగ్స్ అదిరిపోతాయి. ఇలా ఒక డైరెక్ట్ రిలీజ్ సినిమా మీద అయినా, రీ రిలీజ్ సినిమా మీద అయినా ఇన్ స్టాగ్రామ్ ప్రభావం మామూలు రేంజ్ లో లేదు. ముఖ్యంగా GEN Z ఆడియన్స్ అందరూ ఇన్స్ స్టాగ్రామ్ అకౌంట్ లోనే ఉంటున్నారు. అలాంటి ఆడియన్స్ ఉన్న ఈ మీడియం లో అత్యధిక క్రేజ్ ఉన్న స్టార్ హీరోలు ఎవరో చూద్దాం.
అనగా ఒక హీరో పేరు మీదున్న ట్యాగ్ పై ఎన్ని పోస్టులు పడ్డాయి?, అత్యధిక కౌంట్ ఏ హీరో ట్యాగ్ పేరు మీద ఉన్నది అనేది ఇప్పుడు చూద్దాం. ఇన్ స్టాగ్రామ్ గణాంకాల ప్రకారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు. ఆ హ్యాష్ ట్యాగ్ పేరు మీద దాదాపుగా 75 లక్షల పోస్టులు పడ్డాయి. పుష్ప సిరీస్ తర్వాత ఆయన క్రేజ్ పాన్ ఇండియా దాటి, పాన్ వరల్డ్ కి వెళ్లడం తో, ఇన్ స్టాగ్రామ్ లో కూడా ఆయనకు అన్ని దేశాల నుండి అభిమానులు ఉండడం వల్ల ఈ రేంజ్ పోస్టులు పడ్డాయని అంటున్నారు విశ్లేషకులు. ఇక రెండవ స్థానం లో రెబల్ స్టార్ ప్రభాస్ 70 లక్షల పోస్టులతో కొనసాగుతున్నాడు. ఈయన బాహుబలి సిరీస్ నుండే పాన్ వరల్డ్ స్టార్ కాబట్టి, ఆ మాత్రం ఉండడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదని అనిపిస్తోంది.
ఇక వీళ్లిద్దరి తర్వాత మూడవ స్థానం లో కొనసాగుతున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయనపై దాదాపుగా 61 లక్షల పోస్టులు పడ్డాయి. సినిమాలు అప్పుడప్పుడు చేస్తున్నప్పటికీ, అందరి హీరోలు లాగా పాన్ ఇండియన్ సినిమాలు. చేయకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కి ఈ రేంజ్ లో ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ ఉండడం, అది కూడా GEN Z ఆడియన్స్ లో అంటే మామూలు విషయం కాదు. రీసెంట్ గా విడుదలైన ఓజీ చిత్రం కూడా GEN Z ఆడియన్స్ లో పవన్ కళ్యాణ్ కి మంచి క్రేజ్ ఏర్పడేలా చేసింది. ఆ ప్రభావం కూడా ఉండొచ్చని అంటున్నారు. ఇక ఈ ముగ్గురి తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు 52 లక్షల పోస్టులతో నాల్గవ స్థానం లో, 48 లక్షల పోస్టులతో రామ్ చరణ్ 5వ స్థానంలో , 41 లక్షల పోస్టులతో జూనియర్ ఎన్టీఆర్ ఆరవ స్థానం లో కొనసాగుతున్నారు.