Gabbar Singh : బుక్ మైషో’ లో అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన టాప్ 3 రీ-రిలీజ్ చిత్రాలు ఇవే..గబ్బర్ సింగ్ ఏ స్థానంలో ఉందంటే!

'గబ్బర్ సింగ్' చిత్రం కేవలం మొదటి రోజే 10 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టి చరిత్ర తిరగరాసింది. తమిళ హీరో విజయ్ నటించిన 'గిల్లీ' చిత్రానికి మొదటి రోజు 7 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను వస్తే అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు.

Written By: Vicky, Updated On : September 3, 2024 9:57 pm

Gabbar Singh

Follow us on

Gabbar Singh : టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు కొత్త సినిమాలను సైతం డామినేట్ చేసే స్థాయికి చేరింది. స్టార్ హీరోల పాత సినిమాలను 4K క్వాలిటీ కి మార్చి మనకి ఎంతో ఇష్టమైన థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన కొన్ని కొత్త సినిమాలకంటే ఈ రీ రిలీజ్ చిత్రాలకు అత్యధిక వచ్చాయి. అందుకు ఉదాహరణ మూడు వారాల గ్యాప్ లో విడుదలైన ‘మురారి’ , ‘గబ్బర్ సింగ్’ చిత్రాలే. అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రాలకు బ్రహ్మరథం పట్టిన విధానం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. మురారి చిత్రం ఫుల్ రన్ లో 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడితే, ‘గబ్బర్ సింగ్’ చిత్రం కేవలం మొదటి రోజే 10 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టి చరిత్ర తిరగరాసింది. తమిళ హీరో విజయ్ నటించిన ‘గిల్లీ’ చిత్రానికి మొదటి రోజు 7 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను వస్తే అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు.

ఎందుకంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రానికి ఫుల్ రన్ లో 7 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ రికార్డు ఎవ్వరూ అందుకోలేకపోయారు. అలాంటిది విజయ్ కేవలం మొదటి రోజు వసూళ్లతోనే దాటేయడం అప్పట్లో పెద్ద విషయం. కానీ నిన్న విడుదలైన పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రం అవలీలగా ఈ రికార్డుని బ్రేక్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసి చేసింది. వీకెండ్ లో విడుదల అయ్యుంటే ఈ చిత్రం ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టి ఉండేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన ‘బుక్ మై షో’ యాప్ లో ఈమధ్య టికెట్ సేల్స్ గురించి ఒక అప్డేట్ వచ్చింది. గంటలో ఒక సినిమాకి ఎన్ని టిక్కెట్లు అమ్ముడుపోయాయి, 24 గంటల్లో ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయి అనేది మన కళ్ళకు కనిపిస్తాయి.

అలా ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన చిత్రాలలో అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాలేంటో ఒకసారి చూద్దాం. ముందుగా విజయ్ నటించిన గిల్లీ గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాకి బుక్ మై షో యాప్ లో కేవలం 88 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అంత తక్కువ టికెట్స్ అమ్ముడుపోయిన సినిమాకి 7 కోట్లు మొదటి రోజు ఎలా వచ్చాయి అని అనుకుంటున్నారు కదూ?, గిల్లీ చిత్రానికి వచ్చిన వసూళ్లు అత్యధిక శాతం ఓవర్సీస్ నుండి వచ్చినవే , కానీ మురారి మరియు గబ్బర్ సింగ్ చిత్రాలకు ఇండియా వైడ్ గా అమ్ముడుపోయిన టికెట్స్ ఎక్కువగా ఉంటాయి. బుక్ మై షో డేటా ప్రకారం మురారి చిత్రానికి 2 లక్షల 50 వేల టికెట్స్ అమ్ముడుపోగా, గబ్బర్ సింగ్ చిత్రానికి మొదటి రోజే 250 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఫుల్ రన్ లో 270 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.