Agnipariksha audience voting: బిగ్ బాస్ టీం ఎంతో ప్రతిస్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన ‘అగ్ని పరీక్ష'(Agnipariksha) అనే షో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. సామాన్యులను ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) కి ఎంపిక చేసే ప్రక్రియ అంటూ ఈ షో మొదట్లో చాలా హైప్ క్రియేట్ చేసింది. కానీ కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసే ప్రక్రియ చాలా చెత్తగా ఉందంటూ చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా స్క్రిప్టెడ్ షో లాగానే అనిపిస్తుందని, మీకు కావాల్సిన వారినే ఎంచుకున్నారు తప్ప, టాలెంట్ ఉన్న వాళ్ళను పక్కన పెట్టారని, ముఖ్యంగా చివరి నాలుగు మందిని ఎంపిక చేసిన ప్రక్రియ చాలా చెత్తగా ఉందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే అగ్ని పరీక్ష చివరి అంకానికి చేరుకున్న 15 మంది కంటెస్టెంట్స్ ఎవరంటే ప్రసన్న కుమార్, పవన్ కళ్యాణ్ పడాలా, దమ్ము శ్రీజా, నాగ ప్రశాంత్, మనీష్ మర్యాద, హరీష్(మాస్క్ మ్యాన్), అనూష రత్నం, దాలియా షరీఫ్, కల్కి, డెమోన్ పవన్, ప్రియా శెట్టి , సయ్యద్ షకీబ్, శ్రేయ, శ్వేతా శెట్టి, దివ్య.
వీళ్ళను ఇప్పుడు ఓటింగ్ లో పెట్టేసారు. జియో హాట్ స్టార్ లో వీళ్ళకి మనం ఓటు వేయొచ్చు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం ప్రసన్న కుమార్ అందరికంటే అత్యధిక ఓట్లతో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాతి స్థానం లో దమ్ము శ్రీజా ఉందట. ఆడిషన్స్ లో ఈమె జడ్జీలతో పాటు ఆడియన్స్ కి కూడా చిరాకు రప్పించింది. కానీ మొన్నటి ఎపిసోడ్ లో ఈమె జడ్జీలు అన్యాయం చేయడం తో ధైర్యం గా నిలబడింది. అప్పటి నుండి ఈమె పేరు జనాల్లో బలంగా వెళ్ళింది, మద్దతు కూడా భారీగా పెరిగింది. వీళ్లిద్దరి తర్వాత జవాన్ పవన్ కళ్యాణ్ పడాలా, ఆ తర్వాత ప్రియా శెట్టి, శ్వేతా శెట్టి వంటి వారు ఉన్నారని సమాచారం.
అయితే ప్రస్తుతం టాప్ ఓటింగ్ తో కొనసాగుతున్న ప్రసన్న కుమార్ ఎలిమినేట్ అయ్యాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈయన బయటకు వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు. అంతటి టాప్ ఓటింగ్ తో కొనసాగుతున్న ఇతను ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు?, అసలు ప్రక్రియ ఏంటి అనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూస్తే కానీ తెలియదు. ఉన్న 15 మందిని మూడు గ్రూపులు గా విభజించి, ఆ గ్రూప్స్ కి ఒక్కొక్క జడ్జి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారట. ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లోనే మనకి ఇది తెలుస్తుందని సమాచారం. ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ చూసేందుకు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ జడ్జీలు న్యాయంగా వ్యవహరించలేదని అనే అపవాదు ఉంది. మరి ఈ నిండని రాబోయే ఎపిసోడ్స్ తుడిచేస్తుందా లేదా అనేది చూడాలి.