Best OTT Movies: కరోనా కాలంలో సినిమా రంగానికి ఏకైక ఆశా కిరణంగా నిలిచింది ఒక్క ఓటీటీలే. కరోనా క్లిష్ట సమయంలో ప్రేక్షకులను అలరించింది కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. నష్టాల్లో నలిగిపోతున్న నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టింది కూడా ఒక్క ఓటీటీ సంస్థలు మాత్రమే. అలాగే, సినిమా జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక మాధ్యమం కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. పైగా ఓటీటీ సంస్థలు ప్రతివారం ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ రీసెంట్ గా కొన్ని గొప్ప చిత్రాలను, సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాయి. మరి ఆ చిత్రాలు, వెబ్ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం.
Aavasavyuham (ఆవాసవ్యూహం):
ది ఆర్బిట్ డాక్యుమెంటేషన్ ఆఫ్ యాన్ యాంఫిబియన్ హంట్ ఆధారంగా ఈ చిత్రం వచ్చింది. ఈ చిత్రం భారతీయ మలయాళ భాషలో 2022లో విడుదలైంది. ఈ కామెడీ-డ్రామా సైన్స్ ఫిక్షన్ చిత్రం చాలా గొప్పగా ఉంటుంది. ఈ సినిమాని క్రిశాంద్ రచించి దర్శకత్వం వహించారు. మీరు ఈ చిత్రం చూసి కచ్చితంగా సర్ ప్రైజ్ ఫీల్ అవుతారు.

House of Dragon (హౌస్ ఆఫ్ ది డ్రాగన్)
హౌస్ ఆఫ్ ది డ్రాగన్ అనేది ఒక అమెరికన్ ఫాంటసీ డ్రామా టెలివిజన్ సిరీస్. ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కి ప్రీక్వెల్ కూడా, ఇది ఫ్రాంచైజీలో రెండవ పార్ట్. ఈ రెండు సిరీస్‌లు మార్టిన్ రాసిన ‘ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్’ నవల ఆధారంగా రూపొందించబడ్డాయి. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ బెస్ట్ సిరీస్ గా నిలిచింది. ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.
Also Read: Charmme Kaur: ఛార్మి సంచలన నిర్ణయం… ఇక సెలవంటూ బిగ్ షాక్

The Sandman (TV series) ( ది శాండ్ మ్యాన్)
ది శాండ్‌మ్యాన్ అనేది నీల్ గైమాన్ వ్రాసిన కామిక్ పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. ఈ అమెరికన్ ఫాంటసీ డ్రామా టెలివిజన్ సిరీస్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ఈ సిరీస్ ను నెట్‌ఫ్లిక్స్ కోసం గైమాన్, డేవిడ్ S. గోయర్ మరియు అలన్ హీన్ బెర్గ్ కలిసి ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ సీరీస్ కూడా చాలా బాగుంటుంది.

The Bear (ది బేర్)
ది బేర్ అనేది క్రిస్టోఫర్ స్టోర్‌చే సృష్టించిన ఒక అమెరికన్ కామెడీ-డ్రామా. ఇది కూడా టెలివిజన్ సిరీసే. అలెన్ వైట్, ఎబోన్ మోస్-బచ్రాచ్, అయో ఎడెబిరి వంటి టాలెంటెడ్ నటీనటులు నటించారు. ఈ సిరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అన్నిటికీ మించి ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ అయిన సిరీస్ ల్లో ఇది కూడా ఒకటి.

Malayankunju ( మలయంకుంజు)
మలయంకుంజు అనేది 2022లో మలయాళంలో రిలీజ్ అయ్యింది. ఇది ఒక థ్రిల్లర్ చిత్రం. సాజిమోన్ ప్రభాకర్ దర్శకత్వం వహించారు. మహేష్ నారాయణన్ రచించారు. ఇందులో ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే రజిషా విజయన్, ఇంద్రన్స్ సహాయక పాత్రల్లో నటించారు. ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది. డిఫెరెంట్ ఫిల్మ్ గా ఈ సినిమా నిలుస్తోంది.

C’mon C’mon (film)
మైక్ మిల్స్ వ్రాసి దర్శకత్వం వహించిన అమెరికన్ బ్లాక్ అండ్ వైట్ డ్రామా చిత్రమే C’mon C’mon. ఈ సినిమాలో జోక్విన్ ఫీనిక్స్, గాబీ హాఫ్‌మన్, స్కూట్ మెక్‌నైరీ నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 2, 2021న 48వ టెల్లూరైడ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్ గా ప్రదర్శించబడింది. విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది, ముఖ్యంగా దర్శకత్వానికి సినిమాటోగ్రఫీకి ప్రశంసలు అందాయి. ఇది మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది.

Secrets of the Kohinoor (సీక్రెట్స్ ఆఫ్ కోహినూర్)
కోహినూర్ పట్ల కొందరు నాయకులు కోరికతో ఏం చేశారు ? అనే కోణంలో సాగుతుంది ఈ సినిమా. వేదన కలిగించే మైండ్ గేమ్‌లతో పాటు ఇంట్రెస్టింగ్ ప్లేతో ఈ చిత్రం సాగింది. ముఖ్యంగా శిథిలమైన రాజవంశాలను, అదే సమయంలో వజ్రంతో ముడిపడి ఉన్న శక్తివంతమైన చక్రవర్తుల కథల గురించి చెబుతూ ఆసక్తిగా సాగింది ఈ సినిమా.

Parallel Mothers (పారలల్ మదర్స్)
పారలల్ మదర్స్ అనేది పెడ్రో అల్మోడోవర్ రచించి దర్శకత్వం వహించిన స్పానిష్ చిత్రం. ఈ చిత్రంలో పెనెలోప్ క్రజ్ మరియు మిలేనా స్మిత్ నటించారు. ఇది 78వ వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మొదటి చిత్రంగా ప్రదర్శించబడటం విశేషం. ఈ సినిమాకు గానూ పెనెలోప్ క్రజ్ ఉత్తమ నటిగా వోల్పీ కప్‌ను అందుకుంది. ఈ సినిమా కూడా చాలా బాగా ఆకట్టుకుంది.

Peacemaker (TV series) ( పీస్ మేకర్)
పీస్‌మేకర్ అనేది DC కామిక్స్ క్యారెక్టర్ పీస్‌మేకర్ ఆధారంగా జేమ్స్ గన్ రూపొందించిన అమెరికన్ సూపర్ హీరో టెలివిజన్ సిరీస్. ఇది కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది.
Gargi ( ‘గార్గి’ )

సాయి పల్లవి లీడ్ రోల్ లో ఈ ‘గార్గి’ సినిమా వచ్చింది. ఈ లిస్ట్ లో ఈ సినిమా కూడా ఉండటం నిజంగా గ్రేటే. ఈ గార్గి లో ఎమోషన్స్ ను, సస్పెన్స్ ను, అలాగే సోషల్ మెసేజ్ ను చాలా బాగా హ్యాండిల్ చేశారు. సహజమైన చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచిపోతుంది. మొత్తమ్మీద మంచి చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకు పై సినిమాలు, సిరీస్ లు బెటర్ ఛాయిస్ అవుతాయి. కాబట్టి డోంట్ మిస్ ఇట్.
[…] […]