Charmme Kaur: నిర్మాత ఛార్మికి బ్యాడ్ టైం నడుస్తుంది. లైగర్ ఫెయిల్యూర్ తో ఆమె నిండా మునిగిపోయారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా వరకు పూరి, ఛార్మి అనేక కష్టాలు పడ్డారు. ఇల్లు పొలాలు కూడా అమ్ముకున్నారు. అనూహ్యంగా ఇస్మార్ట్ శంకర్ భారీ విజయం సాధించింది. రూ. 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టిన ఈ మూవీ ఇరవై కోట్లకు పైగా లాభాలు ఆర్జించింది. దాంతో పోగొట్టుకున్నవన్నీ రాబట్టుకున్నారు. కార్లు, ఇళ్ళు కొనుక్కున్నారు. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన ఆనందాన్ని లైగర్ ఆవిరి చేసింది. కనీసం 35% శాతం రికవరీ సాధించలేకపోయింది. లైగర్ తో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ పూరిపై ఒత్తిడి తెస్తున్నారు. కొంత మేర నష్టం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా పూరి, ఛార్మిలకు మరో షాక్ తగిలింది. విజయ్ దేవరకొండతో ప్రారంభించిన జనగణమన మూవీ ఆగిపోయింది. ఈ మూవీ నిర్మాతలుగా ఉన్న మై హోమ్ గ్రూప్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. సినిమా బడ్జెట్ నేపథ్యంలో వర్క్ అవుట్ కాకపోవచ్చని నిర్ణయించుకున్న మై హోమ్ గ్రూప్ ప్రాజెక్ట్ చేసేది లేదని చెప్పేశారు . ఇప్పటికే వీరు రూ. 20 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం. నిర్మాతల నిష్క్రమణతో జనగణమన మూవీ ఆగిపోయింది.
లైగర్ డిస్ట్రిబ్యూటర్స్ కి జనగణమన తక్కువ ధరకు ఇస్తామని చెప్పి ఒప్పించాలని పూరి ఆశపడ్డారు. ఆ విధంగా కొంత మేర ఆర్థిక సమస్యల నుండి బయటపడొచ్చు అనుకున్నారు. ఇప్పుడు ఆ ఆశ కూడా పోయింది. జనగణమన ఆగిపోయింది. పూరి, ఛార్మి మరిన్ని సమస్యల్లోకి జారుకున్నారు. ఈ క్రమంలో ఛార్మి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె సోషల్ మీడియాకు విరామం ప్రకటించారు. పూరి కనెక్ట్స్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. అప్పటి వరకు సెలవు, బతుకుదాం బ్రతకనిద్దాం.. అంటూ ట్వీట్ చేశారు.

సడన్ గా ఆమె సోషల్ మీడియాకు ఎందుకు గుడ్ బై చెప్పారో అర్థం కావడం లేదు. మరోవైపు పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ 2 స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రామ్ పోతినేని హామీ ఇచ్చాడేమో తెలియదు కానీ పూరి ఆ పనిలో ఉన్నారట. ప్రస్తుతం రామ్ దర్శకుడు బోయపాటితో ఓ పాన్ ఇండియా చిత్రానికి కమిట్ అయ్యాడు. అలాగే హీరో శర్వానంద్ ఇటీవల ఇంటర్వ్యూలో దర్శకుడు పూరితో మూవీ చేస్తా అన్నాడు. పూరి, ఛార్మి మరలా బౌన్స్ బ్యాక్ కావాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.
[…] […]