Tollywood Heroines in Bigg Boss 9: మరో పది రోజుల్లో కోట్లాది మంది బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9 Telugu) గ్రాండ్ గా మొదలు కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ సీజన్ కి కూడా ఈ సీజన్ కి ఏర్పడినంత క్రేజ్ ఏర్పడలేదు. అందుకు కారణం కామన్ మ్యాన్ కాన్సెప్ట్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ‘అగ్ని పరీక్ష’ అనే షో ద్వారా 15 మంది సామాన్యులను ఎంపిక చేసి ఓటింగ్ లో పెట్టారు. వీరిలో 5 మంది బిగ్ బాస్ హౌస్ లోపలకు వెళ్ళబోతున్నారు. వాళ్ళు ఎవరు అనేది సెప్టెంబర్ 5 వరకు తెలియదు. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న సెలబ్రిటీ లిస్ట్ ని ఇది వరకే మనం చాలాసార్లు చూశాము. అయితే వీరిలో హీరోయిన్స్ కూడా ఉన్నారు, వాళ్లెవరో ఒకసారి చూద్దాం.
ఆశా సైనీ(Asha Shaini) :
‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం లో ఆర్తి అగర్వాల్ స్నేహితురాలిగా నటించిన ఈమెను ఎప్పటికీ మరచిపోలేము. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేసింది కానీ, ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. ఈమె చాలా సున్నితమైన మనిషి అని, పెద్దగా గొడవలకు వెళ్లే రకం కాదని, చాలా సంప్రదాయంగా ఉండే అమ్మాయి అని అంటున్నారు. ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఎలా నెట్టుకొని వస్తుందో చూడాలి.
సంజన(Sanjana) :
ప్రభాస్(Rebel Star Prabhas) ‘బుజ్జిగాడు’ చిత్రం లో త్రిష(Trisha Krishnan) కి చెల్లెలుగా నటించిన ఈమె ఆరోజుల్లో ఎంత పాపులారిటీ ని సంపాదించుకుందో మనమంతా చూశాము. తెలుగు లో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె, కన్నడ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఈమె ఇప్పుడు బిగ్ బాస్ 9 లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతుంది.
తనూజ(Tanuja Puttaswamy) :
జీ తెలుగు లో ప్రసారమైన పాపులర్ సూపర్ హిట్ సీరియల్ ‘ముద్దా మందారం’ లో హీరోయిన్ ఈమె. లేటెస్ట్ గా స్టార్ మా ఛానల్ లో ప్రతి శని ఆదివారాల్లో ప్రసారమయ్యే ‘కూకు విత్ జాతి రత్నాలు’ ప్రోగ్రాం లో ఈమె కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొని మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.
వీళ్ళతో పాటు ఇమ్మానుయేల్, రీతూ చౌదరి, దెబ్ జానీ, శ్రేష్టి వర్మ (జానీ మాస్టర్ మాజీ ప్రేయసి), బిత్తిరి సత్తి వంటి వాళ్ళు కూడా పాల్గొనబోతున్నారు. వీళ్ళతో పాటు మరికొంతమంది టాప్ సెలబ్రిటీస్ కూడా ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో లో కనిపించబోతున్నారు. వీళ్ళతో సామాన్యుల పోటీ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా ఉండే అంశం.