https://oktelugu.com/

Nagarjuna Akkineni: నాగార్జున కెరియర్ ను 3 సార్లు మార్చేసిన మూడు సినిమాలు ఇవే…

ప్రతి హీరో ఏదో ఒక స్టేజ్ లో సక్సెస్ లు లేకుండా చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొంటాడు. ఇక అలాంటి ఒక బ్యాడ్ టైమ్ నడిచినప్పుడే తనను తాను మార్చుకుంటూ ఎలా కంబ్యాక్ ఇచ్చాడు అనేదే ఇక్కడ చాలా కీలకంగా మారుతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : August 13, 2024 / 02:42 PM IST

    Nagarjuna Akkineni

    Follow us on

    Nagarjuna Akkineni: ఒకప్పుడు నాగేశ్వరరావు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలను చేసి స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆయన సాధించిన సక్సెస్ లతో పాటుగా తన కొడుకును కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకున్నాడు. ఇక అందులో భాగంగానే నాగార్జున ను ఇండస్ట్రీలో హీరోగా పరిచయం చేసి అతన్ని స్టార్ హీరోగా మార్చడానికి నాగేశ్వరరావు అహర్నిశలు కష్టపడ్డాడనే చెప్పాలి. మొదట్లో నాగార్జున హీరోగా పనికిరాడు అంటూ భారీ విమర్శలైతే వచ్చాయి. అయినప్పటికీ వాటి వేటిని పట్టించుకోకుండా నాగార్జున వరుస సినిమాలను చేసుకుంటూ సక్సెస్ లను అందుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే రామ్ గోపాల్ వర్మతో శివ సినిమా చేశాడో ఇక ఒక్కసారిగా నాగార్జున ఓవర్ నైట్ లో మాస్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక అప్పుడున్న స్టార్ హీరోల్లో నాగార్జున కూడా ఒకడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు.

    ఇక ఈ సినిమా తర్వాత వెను తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా వరుస సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్లాడు. ఇక నాగార్జున కెరియర్లో ఆయన చేసిన మంచి పని ఏదైన ఉంది అంటే అది అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి రెండు సినిమాలను చేయడం అనే చెప్పాలి. ఈ రెండు సినిమాలతో అతనికి ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్టు కూడా భారీగా లభించింది… అయితే నాగార్జున మాస్ హీరోగా మంచి పేర్లు సంపాదించుకొని ముందుకెళ్తున్న క్రమంలో ‘నిన్నే పెళ్ళాడుతా’ సినిమాతో ఒకసారిగా అతనికి రొమాంటిక్స్ హీరోగా కూడా మంచి గుర్తింపైతే వచ్చింది.

    ఇక ఆ తర్వాత కూడా అలాంటి సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నాడు. తన కెరీర్లో మొదటి టర్నింగ్ పాయింట్ శివ సినిమాతో వస్తే, రెండు టర్నింగ్ పాయింట్ నిన్నే పెళ్లాడతా సినిమాతో వచ్చిందనే చెప్పాలి… ఇక అప్పటి నుంచి వరుసగా కమర్షియల్ మాస్ సినిమాలను చేసుకుంటూ వస్తున్న నాగార్జున 2016 లో చేసిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాతో మరొకసారి ఆయన కెరియర్ అనేది భారీ రేంజ్ లోకి వెళ్ళిపోయింది. ఇక మాస్ కామెడీ ఎంటర్ టైనర్ లను కూడా నాగార్జున చాలా సక్సెస్ ఫుల్ గా డీల్ చేయగలడు అనే రేంజ్ కు ఆయన్ క్రేజ్ వెళ్లిపోయింది.

    ఇక ఈ సినిమాకి ముందు నాగార్జున దాదాపు 5 సంవత్సరాల వరకు ఒక్క సక్సెస్ కూడా లేకుండా ముందుకు సాగుతూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే ‘సోగ్గాడే చిన్నినాయన సినిమాతో సక్సెస్ పడిందో అప్పటినుంచి నాగార్జున మార్కెట్ అనేది భారీగా పెరగింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో అప్పటివరకు నాగార్జున కెరియర్ లో దక్కని ఒక భారీ సక్సెస్ కూడా దక్కిందనే చెప్పాలి… ఇలా నాగార్జున కెరియర్ డౌన్ లో ఉన్న ప్రతిసారి ఒక మంచి సినిమాతో కంబ్యాక్ ఇస్తూ తనను తాను చాలా ఫ్రెష్ గా ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఇప్పుడు కూడా అలాంటి ఒక బ్యాడ్ ఫేజ్ లో ఉన్న నాగార్జున ఇప్పుడు రాబోయే సినిమాలతో మరోసారి తనను తాను కొత్తగా పరిచయం చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…