Tollywood: మన స్టార్ హీరోలకి, తమిళ్ స్టార్ హీరోలకు మధ్య ఉన్న ఈ చిన్న తేడా వల్లే ఆ విషయం లో మనం వెనకబడిపోయామా..?

ఇక తెలుగు తమిళ్ సినిమాల మధ్య ఒకప్పుడు మంచి పోటీ ఉండేది... ఇక తమిళంలో ఉన్న హీరోలు మంచి సబ్జెక్టులతో సినిమాలను చేస్తూ ముందుకు సాగే వారు. తెలుగు హీరోలు మాత్రం కమర్షియల్ సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తూ వచ్చారు...

Written By: Gopi, Updated On : ఆగస్ట్ 13, 2024 2:48 సా.

Tollywood

Follow us on

Tollywood: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సౌత్ సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఒకప్పుడు సౌత్ నుంచి చాలామంది స్టార్ హీరోలు మంచి సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలా ఉంటే ఒకప్పటి నుంచి తమిళ్ సినిమా హీరోలకి మన హీరోలకి మధ్య తేడా ఏంటి అంటూ చాలా రకాల ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మన హీరోలు సెపరేట్ గా కొన్ని క్యారెక్టర్లు మాత్రమే చేయగలరు. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల చేసినట్టుగా మన వాళ్లు రియలేస్టిక్ పాత్రలను చేయలేరు అని ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన మొదటి నుంచి ఉంది. ఉదాహరణకి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ‘బాలా ‘ లాంటి డైరెక్టర్ రూరల్ బ్యాక్ డ్రాప్ తో సినిమాని తెరకెక్కించి ఒక తెగలు సంబంధించిన వ్యక్తుల జీవితాలు, వాళ్ల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఆయన కథని రాసుకొని ఆ పర్ఫెక్ట్ క్యారెక్టర్ లో ఆ హీరోని నటింపజేయాలని చూస్తూ ఉంటాడు. కానీ మన తెలుగు హీరోలు మాత్రం అలాంటి సినిమాలను చేయడానికి చచ్చిన ఒప్పుకోరు. ఎందుకంటే మన వాళ్లకి కమర్షియల్ సినిమాలు కావాలి.

అలాగే హీరో ఎలివేషన్స్ ఉండాలి, సెంటిమెంట్ సీన్స్ ఉండాలి. వీటితో మాత్రమే సినిమాని లాగించాలి అనుకుంటారు. అంతే తప్ప డి గ్లామర్ క్యారెక్టర్స్ ను చేయడానికి వాళ్ళు ఎప్పుడు ఇష్టపడరు. ఇక మొదటి నుంచి తెలుగు సినిమా పతనానికి కారణం ఇలాంటి నిర్ణయాలే అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

అందుకే మన దగ్గర హీరోలు మాత్రమే ఉంటారు. కానీ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో నటులు ఉంటారంటూ చాలా విమర్శలైతే ఎదుర్కొన్నాము. ఇక మొత్తానికైతే ఇప్పుడున్న స్టార్ హీరోలు కూడా ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గట్టుగా గ్రాఫికల్ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తూ భారీ సక్సెస్ లను అందుకుంటున్నారు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఒకప్పటిలాగా రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు కాకుండా వాళ్లు కూడా గ్రాఫికల్గా సినిమాలను చేస్తూ వండర్స్ ని క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు.

ఇక మొత్తానికైతే మన తెలుగు హీరోలకి, తమిళ్ సినిమా హీరోలకి మధ్య ఉన్న తేడా ఏంటంటే వాళ్ళు చిన్న కథ పాయింట్ ను కూడా పెద్ద సినిమాల చేయగలుగుతారు. ఇక ఆ హీరో క్యారెక్టర్ ను డి గ్లామర్ చేసి చూపించిన నటించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కానీ మన వాళ్ళు అలా చేయడానికి సిద్ధంగా ఉండరు. అందువల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీ సక్సెస్ ల పరంగా ముందుకు వెళ్తున్నా కూడా నటుల పరంగా మాత్రం ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చే నటులను తెలుగు సినిమా ఇండస్ట్రీ తయారు చేయలేకపోతుందనేది వాస్తవం…