Homeఎంటర్టైన్మెంట్Balakrishna Rejected Movies: బాలయ్య వద్దనుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే!

Balakrishna Rejected Movies: బాలయ్య వద్దనుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే!

Balakrishna Rejected Movies: నందమూరి నట సింహం బాలకృష్ణ. బాక్సాఫీసు బొనాంజాగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచినవి ఎన్నో ఉన్నాయి. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు అందరు దర్శకులు ముందుకు వస్తుంటారు. ఆయన కెరీర్ లో ఎన్నో సినిమాలు కాదనుకున్నారు. దీంతో వాటిని వేరే వాళ్లు తీసి బ్రహ్మాండమైన హిట్ల కొట్టడం చూశాం. దీంతో చాలా సినిమాలు ఆయన వద్దనుకున్నాక ఇతరుల చేతుల్లోకి వెళ్లడం విశేషం. ఇందులో చాలా సినిమాలు బాలకృష్ణ వద్దనుకున్నవే ఉన్నాయి.

Balakrishna Rejected Movies
Balakrishna

జూనియర్ ఎన్టీఆర్ కు బ్రేక్ ఇచ్చిన సినిమాలు స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి సినిమాలు. మొదట బాలయ్యకే కథలు చెప్పారట రాజమౌళి. కానీ ఆయన నో చెప్పడంతో అవి ఎన్టీఆర్ చేతిలోకి వెళ్లాయి. స్టూడెంట్ నెంబర్ వన్ లో బాలయ్యను ప్రొఫెసర్ గా చూపించాలని అనుకున్నారట. కానీ ఆయన కాదనడంతో వాటిని ఎన్టీఆర్ తో తీసి తన స్టామినా చూపించారు రాజమౌళి. బ్రహ్మాండమైన హిట్లతో ఎన్టీఆర్ కెరీర్ కూడా మలుపుతిరిగింది ఈ సినిమాలతోనే కావడం గమనార్హం.

Also Read: Pranitha Subhash: తల్లయ్యాక తెగించిన హోమ్లీ బ్యూటీ… బికినీలో జలకాలాడుతూ కాకరేపుతున్న పవన్ అత్త కూతురు!

పవన్ కల్యాణ్ తో తీసిన అన్నవరం కథను కూడా మొదట్లో బాలయ్యకే కథ చెప్పారట దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు. కానీ ఆయనకు నచ్చకపోవడంతో పవన్ కల్యాణ్ తో ప్లాన్ చేశారు. సినిమా విజయవంతంగా ప్రదర్శితమవడంతో పవన్ కు మంచి హిట్ ఇచ్చిన సినిమా. రాజశేఖర్ హీరోగా వచ్చిన సింహరాశి కూడా ఫస్ట్ బాలయ్య వద్దకే వెళ్లినా ఆయన నో చెప్పడంతో రాజశేఖర్ చేతుల్లోకి మారింది. దీంతో ఆయన బ్రహ్మాండమైన హిట్ సాధించారు. ఇంకా బాలయ్య కాదనుకున్న ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.

Balakrishna Rejected Movies
Balakrishna

వెంకటేశ్ హీరోగా వచ్చిన సూర్యవంశం ఎంతటి క్రీజే తీసుకొచ్చిందో తెలిసిందే. ఇది కూడా మొదట బాలకృష్ణ తలుపు తట్టినా ఆయన అంగీకరించలేదు. అంతేకాదు నాగవల్లి కూడా బాలయ్య చెంతకు వెళ్లినా ఆయన కుదరదన్నారు. ఇలా ఆయన కాదనుకున్న ఎన్నో సినిమాలు వేరే వాళ్లు తీసి బిగ్గెస్ట్ హిట్లు సాధించిన మాట వాస్తవమే. దీంతో దేనికైనా అదృష్టం ఉండాలి. అంతేకాని అన్ని ఉన్నా అల్లుడినోట్లో శని అన్న చందంగా బాలయ్య కాదనుకున్న సినిమాలు ఇతరుల చేతిలో పడి హిట్లుగా నిలవడం చూశాం.

Also Read:Oscars 2023- NTR and Ram Charan: ఎన్టీఆర్, రామ్ చరణ్‌కు ఆస్కార్?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version