Star Heroines: భారతీయ సాంప్రదాయం లో పెళ్లి అత్యంత కీలక ఘట్టం. వందేళ్ల అనుబంధం. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన వ్యవహారం. అందుకే పెద్దలు పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. కోడలినైనా, అల్లుడినైనా తెచ్చుకోవాలి అంటే.. ఆ కుటంబంలో అటేడు తరాలు ఇటేడు తారలు చూడాలని అంటారు. ఈ రోజుల్లో అది సాధ్యం కాదనుకోండి. అయినప్పటికీ కనీసం కొన్ని ప్రాథమిక నిమయమాలు పాటించాలి. ముఖ్యంగా పెళ్లిపీటలు ఎక్కబోయే జంట ఈడు జోడు బాగుండాలి.
భార్య కంటే వయసులో భర్త పెద్దవాడై ఉండాలి. గరిష్టంగా ఒక ఐదేళ్లు ఏజ్ గ్యాప్ ఉంటే చాలు. అత్యంత ప్రధానమైన ఈ సూత్రాన్ని కొందరు సెలెబ్స్ పాటించలేదు. వారెవరో చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వంశీ మూవీలో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ కలిసి నటించారు. అప్పుడే వీరి మధ్య పేమ చిగురించింది. 2005లో నమ్రత-మహేష్ నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. కాగా మహేష్ కంటే నమ్రత వయసులో మూడేళ్లు పెద్దది.
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో సెటిలైన సంగతి తెలిసిందే. ఆమె అమెరికన్ సింగర్, యాక్టర్ నిక్ జోనస్ ని వివాహం చేసుకుంది. వీరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నిక్ కంటే ప్రియాంక చోప్రా ఏకంగా 10 ఏళ్ళు పెద్దది. 2008లో వీరికి వివాహం జరిగింది. వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకున్న ప్రియాంక విమర్శలకు గురైంది. ఇక సరోగసి పద్దతిలో వీరు ఒక పాపకు జన్మనిచ్చారు.
బాలీవుడ్ స్టార్ లేడీ కత్రినా కైఫ్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమ వివాహం చేసుకుంది. విక్కీ కౌశల్ వయసులో కత్రినా కంటే చిన్నోడు. కత్రినా వయసులో ఐదేళ్లు పెద్దది. తాజాగా టాలీవుడ్ హీరో అఖిల్ ఈ జాబితాలో చేరాడు. సడన్ గా అఖిల్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇండస్ట్రియలిస్ట్ కూతురు జైనబ్ తో అఖిల్ కి ఎంగేజ్మెంట్ జరిగింది. కాగా జైనబ్ ఏకంగా అఖిల్ కంటే వయసులో 9 ఏళ్ళు పెద్దది అట. త్వరలో వీరికి వివాహం జరగనుంది.
ఇటీవల నాగార్జున అఖిల్ ఎంగేజ్మెంట్ గురించి వెల్లడించాడు. మరోవైపు నాగ చైతన్య వివాహం డిసెంబర్ 4న జరగనుంది. అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం ముగిస్తున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య ఏడడుగులు వేస్తున్నాడు.