Tollywood
Tollywood: చిరంజీవి సినిమా వస్తుంది అంటే వేరే హీరోలు వాళ్ళ సినిమాల రిలీజ్ లను వాయిదా వేసుకుంటారు. ఎందుకంటే చిరంజీవి ప్రభంజనం అనేది అలా ఉంటుంది. ఇక బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేయడం లో ఆయనను మించిన హీరో మరోకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇలాంటి చిరంజీవి సినిమాను సైతం బ్రేక్ చేసి రెండు సినిమాలు సక్సెస్ లను అందుకున్నాయి అయితే ఆ హీరోలు ఎవరూ ఆ సినిమాలు ఏంటో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ఆర్.నారాయణమూర్తి హీరోగా వచ్చిన ‘ఒరేయ్ రిక్షా’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా నవంబర్ 9, 1995 వ సంవత్సరంలో వచ్చింది.ఈ సినిమాకి దాసరి నారాయణరావు దర్శకుడుగా వ్యవహరించాడు.ఈ మూవీ అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాలో సాంగ్స్ అయితే ఒక ప్రభంజనాన్ని సృష్టించాయనే చెప్పాలి. ఇక ఇది వచ్చిన సరిగ్గా నెల రోజులకి కోడి రామకృష్ణ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా చేసిన ‘రిక్షావోడు ‘ సినిమా రిలీజ్ అయింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచిందనే చెప్పాలి. ఒరేయ్ రిక్షా ప్రభంజనం తార స్థాయిలో ఉండడంతో నారాయణ మూర్తి సినిమాని బీట్ చేయడంలో చిరంజీవి తడబడ్డాడనే చెప్పాలి. రీసెంట్ గా చిరంజీవి ఒక ఈవెంట్లో నారాయణమూర్తి గురించి మాట్లాడుతూ ఈ ప్రస్తావన తీసుకొచ్చి నారాయణమూర్తి సినిమా తన సినిమాను బీట్ చేయడం తనకు చాలా గర్వంగా అనిపించిందని చిరంజీవి చెప్పడం విశేషం…
ఇక ఇదిలా ఉంటే 2001వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా బాలయ్య హీరోగా వచ్చిన నరసింహనాయుడు సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇక అదే సంక్రాంతికి వచ్చిన చిరంజీవి మృగరాజు సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేస్తుందనుకున్న మృగరాజు అలా ఫ్లాప్ గా మిగలడం అప్పట్లో మెగాస్టార్ అభిమానుల్ని చాలా వరకు కలిచి వేసిందనే చెప్పాలి.
ఇక పెద్ద గా అంచనాలు లేకుండా వచ్చిన బాలయ్య బాబు నరసింహనాయుడు సినిమా మాత్రం ఇంట్రెస్ట్ హిట్టు కొట్టడం అప్పట్లో బాలయ్య అభిమానులను సంతోషానికి గురి చేసిందనే చెప్పాలి… ఇక బాక్సాఫీస్ ను తన సినిమా కలెక్షన్స్ తో ఊచకోత కోసే చిరంజీవి ఆ సమయం ఇలాంటి ప్లాప్ లను మూటగట్టుకోవల్సి వచ్చింది…