MLA Lasya Nanditha: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అంతకు ముందు రెండు వారాల వ్యవధిలో జరిగిన ప్రమాదాలలో ఆమె వెంట్రుకవాసిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కానీ మూడో ప్రమాదంలో ఆమె దుర్మరణం చెందారు. కన్నవాళ్ళను, కార్యకర్తలకు సెలవంటూ కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి అటు లాస్య కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు, భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు చెబుతున్న విషయాలు పొంతన లేకుండా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బయటకు చెప్పలేని లేదా చెప్పకూడని నిజాలు ఏమైనా ఉన్నాయా? ఏదో దాచిపెట్టే ప్రయత్నం అన్ని వైపుల నుంచి జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లాస్య నందిత ప్రమాదంలో మరణించిన తర్వాత పలు విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆమె దర్గాకు వెళ్లి పూజలు చేసి వస్తుంటే ప్రమాదం జరిగిందని ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ విలేకరి చెప్పారు. బాసరలో పూజ చేయించుకుని వస్తుంటే ప్రమాదం జరిగిందని లాస్య నందిత సోదరి ప్రకటించారు. తెలిసిన వాళ్ళ వేడుకకు వెళ్లి వస్తుంటే ప్రమాదం జరిగిందని లాస్య నందిత దగ్గర బంధువు వివరించారు. ఇవన్నీ చూస్తుంటే భిన్నమైన ప్రకటనలు లాగా కనిపిస్తున్నాయి. అయితే వారు నిజం చెప్పారా? తెలిసిన సమాచారం మాత్రమే చెప్పారా? ఒకవేళ తెలిసిన సమాచారమే చెబితే ఇంత పొంతన లేకుండా ఎలా ఉంటుంది? వారు చెప్పిన పరస్పర విరుద్ధ ప్రకటనలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి.
లాస్య నందిత వయసు ప్రస్తుతం 37 సంవత్సరాలు. ఆమె బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ చదివారు. ఇంత వయసు వచ్చినా పెళ్లి జరగలేదా? పెళ్లి జరిగితే ఆమె భర్త ఎక్కడ? ఒకవేళ పెళ్లి జరగకుంటే ఇంత వయసు వరకు ఎందుకు చేసుకోలేదు? అవి ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి అయినప్పటికీ.. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తమవుతూనే ఉంటాయి. చివరికి లాస్య నందిత మృత దేహానికి ఆమె మాతృమూర్తి తలకొరివి పెట్టారు. ” నిన్న మేడాన్ని కలిసేందుకు వచ్చాను. ఒంట్లో బాగోలేదని పడుకునే ఉన్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. సాయంత్రం వరకు ఎదురుచూసి వెళ్లిపోయాను. టీవీలో ఆమె వార్త చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాను” అని ఓ టీవీ ఛానల్ ప్రతినిధితో భారత రాష్ట్ర సమితికి చెందిన కార్యకర్త తన ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇలా పరస్పర విరుద్ధమైన సమాచారం వెలుగు చూస్తున్న నేపథ్యంలో లాస్య నందితకు ఏమైంది? ఏం జరిగి ఉంటుందనేది అంతు పట్టకుండా ఉంది. గురువారం రాత్రి పది గంటలకు ఇంటి నుంచి బయలుదేరి బాసర వెల్లి పూజలు ఎలా చేస్తారు? రాత్రిపూట బాసర గుడిలో పూజలు చేయరు కదా? పైగా లాస్య నందిత చేతికి ఏదో దారం ఉంది అని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె చేతికి ఆ దారం ఎందుకు కట్టారు? వాళ్ల అక్క ముందు వేరే కార్లో వెళ్ళింది.. లాస్య నందిత టిఫిన్ చేస్తానని చెప్పి వేరే కారులో వచ్చింది అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆ సమయంలో టిఫిన్ చేయడం ఏంటి? లాస్య ప్రయాణిస్తున్న కారును టిప్పర్ ఢీ కొట్టింది అని చెబుతున్నారు. ఇంతకీ ఆ టిప్పర్ ఏమైంది? ఔటర్ రింగ్ రోడ్డు మీద ఓవర్ స్పీడ్ వెళ్లే వాహనాలను సీసీ కెమెరాలు ద్వారా చూసి చలాన్లు విధించే పోలీసులు.. లాస్య నందిత కారుకు జరిగిన ప్రమాదానికి సంబంధించి సి సి ఫుటేజ్ ఎందుకు బయటకు విడుదల చేయడం లేదు. దీని వెనుక ఎవరి ప్రమేయమైనా ఉందా? లాస్య మరణం వెనుక ఏదైనా కుట్ర జరిగిందా? అనే అనుమానాలను భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఆమె మృతి వెనుక ఉన్న అసలు విషయాలు ఎప్పుడు వెలుగులోకి వస్తాయో మరి?