Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు అందులో అల్లు అర్జున్ ఒకరు. ఆయన చేస్తున్న చాలా సినిమాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచడమే కాకుండా భారీ కలెక్షన్స్ ను కూడా రాబట్టే దిశగా ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా ఒక మంచి విషయం. ఇక ఇప్పటికే ఆయన చేసిన పుష్ప సినిమా భారీ సక్సెస్ ను సాధించడంతో పాటుగా భారీ కలెక్షన్లను కూడా కొల్లగొట్టింది. మరి ఇప్పుడు వస్తున్న పుష్ప 2 సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుష్ప 2 సినిమాకి భారీ క్రేజ్ అయితే దక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా మీద తెలుగులోనే కాకుండా యావత్ ఇండియన్ ఇండస్ట్రీ లో భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక మరికొద్ది గంటల్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ మొదలవ్వనున్న నేపధ్యం లో ఈ సినిమా విషయంలో చాలామంది అల్లు అర్జున్ అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని కొట్టబోతున్నాం అనే రేంజ్ లో వాళ్ళ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. ఇక ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందనే దానిమీద తీవ్రమైన కసరత్తులైతే జరుగుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో అల్లు అర్జున్ ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే అల్లు అర్జున్ తన దైన రీతిలో గుర్తింపునైతే సంపాదించుకుంటాడు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో కొంతమంది స్టార్ హీరోలు గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక అందులో ఎవరెవరు ఉన్నారు అంటే మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి సూర్య ఇందులో గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.
మరి వాళ్ళు ఎలాంటి సిచువేషన్ లో ఈ సినిమా లో కనిపిస్తారనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇక మొత్తానికైతే వీళ్ళందర్నీ సినిమాలో ఇన్వాల్వ్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే సినిమా మీద హైప్ ను పెంచడానికే తప్ప మరేమీ లేదని కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. అయితే సినిమా చూసేవాళ్ళకు సైలెంట్ సర్ప్రైజ్ గా ఈ క్యారెక్టర్స్ ను రప్పించాలనే ఉద్దేశ్యంతోనే ఈ గెస్ట్అపీరియన్స్ ని ప్లాన్ చేసినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి అల్లు అర్జున్ తన కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ గా నిలుపుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా తెలుగు సినిమా స్థాయి అనేది పాన్ ఇండియా స్థాయిలో భారీగా ఎలివేట్ అవ్వడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…