https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ కి కథ వినిపించిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్…మరి బన్నీ డిసీజన్ ఏంటి..?

సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది హీరోలు పాన్ ఇండియాలో వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుంటున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 4, 2024 / 09:46 AM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun : సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది హీరోలు పాన్ ఇండియాలో వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుంటున్నారు. అలాంటి హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. ఈయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి… మరి ఇప్పుడు వస్తున్న ‘పుష్ప 2’ సినిమాతో ఎలాంటి సక్సెస్ ఆడిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…

    ప్రస్తుతం అల్లు అర్జున్ రేంజ్ అనేది మారిపోయింది. ఎప్పుడైతే పుష్ప సినిమా చేశాడో అప్పటినుంచి పాన్ ఇండియా హీరోగా ఎదగడమే కాకుండా అప్పటినుంచి ఇప్పటివరకు తనకు చాలామంది దర్శకులు కథలను కూడా వినిపిస్తున్నారు. ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ కి రెడీ అయిన నేపథ్యంలో ఇప్పుడు మరి కొంతమంది బాలీవుడ్ దర్శకులు సైతం అల్లు అర్జున్ కి కొన్ని కథలను వినిపించారట. అందులో ద మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న సంజయ్ లీలా భన్సాలీ కూడా అల్లు అర్జున్ కి ఒక డిఫరెంట్ స్టోరీ అయితే చెప్పారట. మరి ఆ స్టోరీకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అనే విషయాల మీద సరైన క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతం బాలీవుడ్ దర్శకులందరు అల్లు అర్జున్ వెంట పడుతున్నట్టుగా తెలుస్తోంది.

    ఎందుకంటే పుష్ప 2 సినిమా మీద భారీ హైపైతే ఉంది. ఎలాగైనా ఆ సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతుంది. కాబట్టి అల్లు అర్జున్ కి భారీ క్రేజ్ అయితే వస్తుంది. ఇక ఆ క్రేజ్ ను వాడుకోవడానికి బాలీవుడ్ దర్శక నిర్మాతలు అల్లు అర్జున్ వెంట పడుతున్నట్టుగా తెలుస్తోంది.

    మరి తను అనుకున్నట్టుగానే ఇప్పుడు తన తదుపరి సినిమాల కోసం బాలీవుడ్ దర్శకులను ఎంచుకుంటాడా లేదా అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ తో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగతో ఒక సినిమా చేయడానికి ఇంతకుముందే ఒప్పందం అయితే కుదుర్చుకున్నాడు.

    మరి ఇప్పుడు సంజలీలా భన్సాలీ లాంటి దర్శకుడి తో సినిమా చేయాలన్నా కూడా ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ సినిమా చేయాల్సి ఉంటుంది. మరి ఈజీగా ఆయనకు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం అయితే పట్టే అవకాశం ఉంది. ఒకవేళ సినిమా ఓకే అయినా కూడా అల్లు అర్జున్ కోసం అన్ని రోజులపాటు ఆయన వెయిట్ చేస్తాడా లేదంటే మరొక హీరోతో సినిమాని లాగించేస్తాడా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా తన దైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరో అల్లు అర్జున్ ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…