https://oktelugu.com/

Star actors : హీరోలతో పాటు సమానమైన రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్న స్టార్ యాక్టర్స్ వీళ్లే…

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు తమ సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమం లోనే హీరోలతో పాటు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా పోటీ పడి నటిస్తూ వాళ్ళు కూడా భారీ క్రేజ్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 29, 2024 / 12:56 PM IST

    SJ Surya and Fahad puzzle

    Follow us on

    Star actors : చాలామంది హీరోలు ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా గాని, విలన్లుగా గాని మారుతున్నారు. కారణం ఏదైనా కూడా వాళ్ళు చేసే ప్రతి సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు. ఇక అలాగే దర్శకులు కూడా ఈ మధ్య నటులుగా మారిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అందులో భాగంగానే ఎస్ జే సూర్య లాంటి స్టార్ డైరెక్టర్ సైతం నటుడిగా మారి రాణిస్తున్నాడు. ప్రస్తుతం అన్ని భాషల్లో సినిమాలను చేస్తూ ఆయన స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఎస్ జె సూర్య తను ఒక సినిమాలో నటించినందుకు గాను భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఆయన స్టార్ హీరోల రేంజ్ లో అయితే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అంటూ పలు రకాల ఆసక్తికరమైన వాక్యలైతే వస్తున్నాయి. ఇక ఆయన దాదాపు రోజుకి 15 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమా మొత్తానికి ఒకేసారి ప్యాకేజీ లా మాట్లాడితే మాత్రం దాదాపు 8 నుంచి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే వార్తలైతే వస్తున్నాయి.

    ఇక రీసెంట్ గా శంకర్ చేసిన ‘భారతీయుడు 2’ సినిమా కోసం ఆయన దాదాపు 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అయితే ఆయన పాత్ర భారతీయుడు 2 లో పెద్దగా ఏమీ లేకపోయిన కూడా ‘భారతీయుడు 3’ లో చాలా ఎక్కువగా ఉంటుందని అందుకోసమే తనకు అంత మొత్తాన్ని చెల్లించారనే వార్తలైతే వినిపిస్తున్నాయి…

    ఇక ఇతనితో పాటుగా భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్న మరొక నటుడు ‘ఫహద్ పజిల్’. ఈ మలయాళ నటుడు ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా చేసి మెప్పించడంలో సిద్ధహస్తుడు. మరి ఆయన రోజుకు దాదాపు 12 లక్షల వరకు రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే తెలుగులో పుష్ప సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో కూడా మరోసారి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేయడానికి త్వరలోనే మన ముందుకు రాబోతున్నాడు. కాబట్టి ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ అయితే తన రెమ్యూనరేషన్ మరింత భారీగా పెంచే అవకాశాలైతే ఉన్నాయి.

    ఇక పుష్ప 2 పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈ సినిమాతో ఆయనకు ఇండియా వైడ్ గా భారీ మార్కెట్ అయితే క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి… వీళ్ళ రెమ్యూనరేషన్ చూసిన సగటు ప్రేక్షకులు స్టార్ హీరోలతో పాటు సమానమైన రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అంటూ వీళ్ళ మీద కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు…