Dhoom 4 : ధూమ్ 4 పై క్రేజ్ అప్డేట్… విలన్ గా ఆ స్టార్ హీరో!

ధూమ్ హాలీవుడ్ సక్సెస్ఫుల్ సిరీస్. ఇప్పటి వరకు మూడు సిరీస్లు రాగా సూపర్ హిట్ కొట్టాయి. తాజాగా ధూమ్ 4 కి రంగం సిద్ధం అవుతుంది. ఈ స్టార్ హీరో ఈ చిత్రంలో విలన్ రోల్ చేస్తున్నాడన్న న్యూస్ బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Written By: S Reddy, Updated On : September 29, 2024 1:11 pm

Dhoom 4

Follow us on

Dhoom 4 : ధూమ్ సిరీస్ కి ఇండియా వైడ్ అభిమానులు ఉన్నారు. 2004లో యష్ రాజ్ ఫిల్మ్స్ ధూమ్ ఫస్ట్ పార్ట్ ని నిర్మించింది. జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్, ఈషా డియోల్, రిమి సేన్ ప్రధాన పాత్రలు చేశారు. యాక్షన్ థ్రిల్లర్ ధూమ్ భారీ విజయం అందుకుంది. అభిషేక్ బచ్చన్ ఏసీపీ రోల్ చేయగా, జాన్ అబ్రహం దొంగగా అలరించాడు. అనంతరం 2006లో ధూమ్ 2 తెరకెక్కింది. పార్ట్ 2లో హృతిక్ రోషన్ జాయిన్ అయ్యాడు. క్రేజీ దొంగగా ఆయన ఆకట్టుకున్నారు.

మరోసారి ఏసీపీగా అభిషేక్ బచ్చన్ నటించారు. ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించడం విశేషం. పార్ట్ 1 కి మించి భారీ విజయం పార్ట్ 2 నమోదు చేసింది. ఇక 2013లో ధూమ్ 3 విడుదలైంది. అమిర్ ఖాన్ ఈ ఫ్రాంచైజ్ లో అడుగు పెట్టాడు. ధూమ్ 3 సైతం విజయం అందుకుంది. దాదాపు పదేళ్ల అనంతరం ధూమ్ 4కి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. బాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరో విలన్ రోల్ చేస్తున్నాడట. ఆయన ఎవరో కాదు రన్బీర్ కపూర్. యానిమల్ హీరో ధూమ్ 4 లో ప్రతినాయకుడు పాత్ర చేస్తున్నాడట. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. నిజానికి ధూమ్ సిరీస్లో విలన్ అంటే… ప్రధాన హీరో అని చెప్పొచ్చు. పోలీసులను ముప్పతిప్పలు పెట్టే దొంగనే ధూమ్ సినిమాకు హీరో అవుతాడు.

జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, అమిర్ ఖాన్ ఈ సిరీస్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెరిశారు. సెకండ్ హీరోగా అభిషేక్ బచ్చన్ నటించాడు. అదన్నమాట సంగతి. ధూమ్ 4 కి సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం రన్బీర్ కపూర్ రామాయణం మూవీ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రెండు మూడు భాగాలుగా ఈ సిరీస్ తెరకెక్కనుందట. సౌత్ ఇండియన్ బ్యూటీ సాయి పల్లవి రామాయణం చిత్రంలో సీతగా నటించడం విశేషం.

కాగా గత ఏడాది యానిమల్ చిత్రంతో రన్బీర్ కపూర్ భారీ విజయం నమోదు చేశాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ చిత్రం రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అనిల్ కపూర్, రష్మిక మందాన, పృథ్విరాజ్, బాబీ డియోల్ కీలక రోల్స్ చేశారు. యానిమల్ మూవీపై విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ప్రేక్షకులు ఆదరించారు.