Satish Vegesna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు చాలామంది తమదైన రీతిలో సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ప్రత్యేకతను చాటుకోవడానికి చాలా కష్ట పడుతూ ఉంటారు. అందులో కొంతమంది సక్సెస్ అయితే మరి కొంతమంది మాత్రం ఫెయిల్యూర్ డైరెక్టర్లు గా మారి పోతు ఉంటారు.ఇక కొంతమంది మాత్రం మొదట కొన్ని సినిమాలతో సక్సెస్ అయినప్పటికీ లాంగ్ రన్ లో మాత్రం వాళ్ళు నిలబడలేక పోతున్నారు. అలాంటి వాళ్లలో సతీష్ వేగేశ్న ఒకడు. ఈయన శతమానం భవతి అనే సినిమాతో ఇండస్ట్రీలో మంచి హిట్ ని సొంతం చేసుకున్నాడు. అలాగే ఈ సినిమాతో నేషనల్ అవార్డు ని కూడా దక్కించుకున్నాడు. కానీ ఆ తర్వాత నితిన్ తో చేసిన శ్రీనివాస కళ్యాణం సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.దాంతో తన ఖాతాలో ఒక డిజాస్టర్ వచ్చి చేరింది.
ఇక ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన ఎంతమంచి వాడవురా సినిమా కూడా భారీ ఫ్లాప్ ని మూట గట్టుకుంది. ఇక ఇలాంటి క్రమంలో ఈయన ఎన్టీఆర్ బావమరిది అయిన నార్నే నితిన్ ని హీరో గా పెట్టీ ఒక సినిమా చేస్తున్నాడు అంటూ అప్పట్లో ఒక టాక్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రావడం లేదు. ఆల్మోస్ట్ ఆ సినిమా ఆగిపోయింది అని టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఇలాంటి క్రమంలో సతీష్ వేగేశ్న ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోవాల్సిన సమయం వచ్చిందని చాలామంది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.ఎందుకంటే ఆయన మేకింగ్ లో పెద్దగా కొత్తదనం ఏమీ ఉండదు, అవే పాత చింతకాయ పచ్చడి స్టోరీలను తీసుకొని అదే రొటీన్ మేకింగ్ లో తెరకెక్కిస్తూ ఉంటాడు.
ఇప్పుడంతా అనిమల్ లాంటి సినిమా మేకింగ్ ట్రెండ్ నడుస్తుంటే ఇలాంటి పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమాలు ఇంకా జనాలు చూసే సమయం కానీ, ఆసక్తి గాని లేకపోవడంతో ఈయన నుంచి సినిమాలు వచ్చిన అవి పెద్దగా సక్సెస్ అయ్యే అవకాశాలైతే లేవు కాబట్టి ప్రస్తుతం ఈయన ఫేడ్ అవుట్ దశలో ఉన్నట్టుగా కొంతమంది సినీ పెద్దలు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…
అలా కాకుండా ఈయన ఒక సినిమా చేసి సక్సెస్ అయితే మళ్లీ సినిమాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఈయనకి పెద్దహీరోలతో సినిమాలు చేసే అవకాశం అయితే చాలా తక్కువ అనే చెప్పాలి…