Gujarat Titans: ప్రస్తుతం ఐపీఎల్ లో ట్రేడింగ్ అనేది చాలా ఎక్కువగా నడుస్తుంది.నిజానికి ఈ నెల 19వ తేదీన మినీ ఆక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ లో పాల్గొన్న ప్రతి టీం కూడా వాళ్ల టీమ్ నుంచి కొంతమంది ప్లేయర్లను రిలీజ్ చేశారు. ఇక ఈ క్రమంలో ట్రేడింగ్ పద్ధతిలో ప్లేయర్ల ను తీసుకోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఇక ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ టీం కి ఒకసారి కప్పు అందించిన ఆ టీమ్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్య ని ముంబై ఇండియన్స్ టీం ట్రేడింగ్ పద్ధతి ద్వారా తీసుకుంది. అయితే ఆయనకు భారీ మొత్తంలో అమౌంట్ ఇస్తున్నారు అనేది ఒక విధమైన ఆర్గుమెంట్ అయితే ట్రేడింగ్ విధానంలో హార్దిక్ పాండ్య ను ముంబై తీసుకోవడం ఒక ఆసక్తికరమైన విషయం…
ఎందుకంటే ముంబై టీం కి ఆల్రెడీ చాలామంది ప్లేయర్లు ఉన్నారు. హార్థిక్ పాండ్య ని తీసుకోవడం వెనక చాలా రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి.ఇక ఇదిలా ఉంటే మళ్లీ గుజరాత్ టైటాన్స్ టీం కి మరో ఎదురు దెబ్బ తగిలేలా ఉంది.ఆ టీమ్ లో స్టార్ పేసర్ అయిన మహమ్మద్ షమీ ని కూడా ఇతర జట్లు ట్రేడింగ్ విధానంలో తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి.
నిజానికి ఈ ట్రేడింగ్ విధానం వల్ల చాలా జట్లు నష్టపోతుంటే కొన్ని జట్లు మాత్రం లాభాపడుతున్నాయి…ఇక దీనిపైన జిటి సిఓఓ అర్విందర్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా ప్రాంచైజీలు డైరెక్ట్ గా ఆటగాళ్లను సంప్రదించడం తప్పు అంటూ మండిపడ్డారు…ఇక ఐపీఎల్ ట్రేడింగ్ విండో ఈనెల 12 వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఆలోపు షమీ టీమ్ లో ఉంటాడా లేదా టీం నుంచి బయటికి వెళ్లిపోతాడా అనేది తెలియాల్సి ఉంది…
ఇక ఈ ట్రేడింగ్ విధానం అనేది టీమ్ లకు బాగా కలిసి వస్తున్న అంశమనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకు ముందు బాగా ఆడిన ప్లేయర్లతో డైరెక్ట్ గా డీలింగ్ కుదుర్చుకొని ట్రేడింగ్ విధానం ద్వారా ఆ ప్లేయర్లకి ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ ప్లేయర్లను ఆశపెట్టి మరి వాళ్ళ టీంలోకి తీసుకుంటున్నారు. ఇక ముంబై ఇండియన్స్ టీమ్ లో ఉన్న ఆల్ రౌండర్ కెమరన్ గ్రీన్ ని ట్రేడింగ్ విధానం ద్వారా బెంగళూరు టీం తీసుకుంది…ఇలా ఈ ట్రేడింగ్ ద్వారా ప్లేయర్లు చాలా లాభ పడుతున్నారు…