Goat Movie: గోట్ సినిమా ప్లాప్ కి కారణాలు ఇవే…విజయ్ కి తెలుగు లో సక్సెస్ రాకపోవడానికి కారణం కూడా ఇదేనా..?

తెలుగులో మార్కెట్ ను సంపాదించడానికి పలు భాషల హీరోలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్లు చేసే సినిమాలకు ఇక్కడ మంచి ఆదరణ దక్కుతే వాళ్ళ మార్కెట్ కూడా భారీగా పెరుగుతుంది. అందువల్ల తెలుగులో సక్సెస్ అయితే చాలు అనుకునే ఇతర భాషల హీరోలు చాలా మంది ఉన్నారు...

Written By: Gopi, Updated On : September 11, 2024 12:21 pm

Goat Movie

Follow us on

Goat Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఇళయ దళపతి గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు విజయ్… ఈయన తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్ గా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వచ్చిన గోట్ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. కారణం ఏంటి అనే విషయం మీదనే ఇప్పుడు పలు రకాల చర్చలైతే జరుగుతున్నాయి. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను అలరించలేక పోతుంది. నిజానికి విజయ్ కి తెలుగులో అంత మంచి గుర్తింపు రాకపోవడానికి కూడా కారణం ఏంటి అంటే ఆయన యాక్టింగ్ లో కొంచెం ఓవర్ యాక్టింగ్ కనిపిస్తుంది. సూర్య విక్రమ్ లాంటి నటులు సెట్టిల్డ్ పర్ఫామెన్స్ ఇస్తే విజయ్ మాత్రం ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా తన ఓన్ ఆటిట్యూడ్ ను చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

అందువల్లే ఆయనకు తెలుగులో మాత్రం అంత మంచి ఆదరణ అయితే దక్కడం లేదు. నిజానికి విజయ్ లాంటి హీరో తమిళంలో భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక రజనీకాంత్ తర్వాత అంత మంచి గుర్తింపు సంపాదించుకున్న మాస్ హీరో కూడా విజయ్ కావడం విశేషం…కానీ తెలుగు ప్రేక్షకులను మాత్రం అలరించడంలో తను ఎప్పటికప్పుడు ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే గోట్ సినిమాలో విజయ్ పర్ఫామెన్స్ విషయం పక్కన పెడితే కథ పరంగా చూసుకున్న కూడా గోట్ అనేది పెద్ద హీరోతో చేయాల్సిన కథ అయితే కాదు. హీరోతో ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ ని తీసి ఉంటే బాగుండేది.

కానీ వెంకట్ ప్రభు మాత్రం విజయ్ ను చాలా కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో రెండు క్యారెక్టర్లలో విజయ్ పాత్రను రాసుకొని ఒక క్యారెక్టర్ ను ఏఐ ద్వారా క్రియేట్ చేసిన విధానం కూడా ప్రేక్షకుడికి చిరాకు పుట్టించింది. అందువల్ల ఈ సినిమా విషయంలో సగటు ప్రేక్షకుడు సైతం సినిమాకి కనెక్ట్ అవ్వలేకపోయాడు. ఇక కథ పరంగా చూసుకున్న విజయ్ లుక్స్ పరంగా చూసుకున్న ఈ సినిమా అనేది ఒక బ్యాడ్ ఎక్సపీరియన్స్ అనే చెప్పాలి.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన భారీ ఫ్లాప్ ని మూట గట్టుకున్నాడనే చెప్పాలి. ఇక తెలుగులో ఆయనకు మంచి సక్సెస్ అయితే దక్కే అవకాశాలు లేనట్టుగా తెలుస్తోంది. ఇకమీదట కూడా ఆయన సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే ఇక మీదట పాలిటిక్స్ లో బిజీ కానున్న నేపధ్యంలో విజయ్ కి తెలుగులో సక్సెస్ అయితే దక్కలేదనే చెప్పాలి…