Maruti Brezza : ఇన్నాళ్లు పట్టించుకోని ఈ కారును.. ఇప్పుడు సేల్స్ లో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టారు..

కొన్ని కంపెనీలు ఇప్పటికే ఎస్ యూవీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వీటిలో లో బడ్జెట్ తో పాటు మంచి ఫీచర్స్ ఉన్న కార్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ తరుణంలో మారుతికి చెందిన ఓ ఎస్ యూవీ సేల్స్ లో మొదటి స్థానంలో నిలచింది. అయితే ఈ కారు ఇంతలా సేల్స్ అవుతుందని ఎవరూ ఊహించలే. ఇంతకీ ఆ మోడల్ ఏదో తెలుసుకోవాలని ఉందా? అయితే వివరాల్లోకి వెళ్లండి..

Written By: Chai Muchhata, Updated On : September 11, 2024 12:22 pm

Maruti Brezza

Follow us on

Maruti Brezza : సాధారణంగా చాలా మంది హ్యాచ్ బ్యాక్ కార్ల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తుంటారు. తక్కువ ధరలో అమకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటారు. కానీ ఇటీవల ఎక్కువగా ఎస్ యూవీలు ఎక్కువగా విక్రయాలు జరుపుకున్నాయి. హ్యాచ్ బ్యాక్ కంటే ఇవి విశాలంగా ఉండడంతో పాటు ఇంజిన్ పనితీరులో మెరుగ్గా ఉండడం వల్ల వీటిపై ఎక్కువగా మనసు పారేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఇప్పటికే ఎస్ యూవీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వీటిలో లో బడ్జెట్ తో పాటు మంచి ఫీచర్స్ ఉన్న కార్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ తరుణంలో మారుతికి చెందిన ఓ ఎస్ యూవీ సేల్స్ లో మొదటి స్థానంలో నిలచింది. అయితే ఈ కారు ఇంతలా సేల్స్ అవుతుందని ఎవరూ ఊహించలే. ఇంతకీ ఆ మోడల్ ఏదో తెలుసుకోవాలని ఉందా? అయితే వివరాల్లోకి వెళ్లండి..

మారుతి నుంచి వివిధ మోడళ్లు మార్కెట్లోకి వచ్చి అలరిస్తూ ఉంటాయి. ఇప్పటికే ఈ కంపెనీకి చెందిన బ్రెజ్జా రోడ్లపై తిరుగుతోంది. కానీ మొన్నటి వరకు హ్యాచ్ బ్యాక్ కు ప్రిఫరెన్స్ ఇవ్వడంతో ఈ కారును పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఇటీవల ఎస్ యూవీల జోరు కొనసాగడం ప్రారంభమైంది. దీంతో మారుతికి చెందిన బ్రెజ్జాను ఎక్కువగా కొనుగోలు చేశారు. ఈ కంపెనీ రిలీజ్ చేసిన ఆగస్టు సెల్స్ లో బ్రెజ్జా 19,190 యూనిట్ల విక్రయాలు జరుపుకుంది. అంతేకాకుండా ఇది మొదటి స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

మారుతి బ్రెజ్జా ఫీచర్స్ తో పాటు ధర ఆకర్షిస్తోంది. ఇందులో 9 అంగులాల స్మార్ట్ ప్రో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కు సపోర్టు చేస్తుంది. ఈ కారుకు హైటెక్ కెమెరాను అమర్చారు. ఇది 360 డిగ్రీలు కవర్ చేస్తుంది. 5 సీటర్ కారు అయిన బ్రెజ్జా లాంగ్ జర్నీకి అనుకూలంగా ఉంటుంది. ఇందులో సేప్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంది. దీంతో మైలేజ్ కూడా ఎక్కువే ఇచ్చే అవకాశం ఉంది.

బ్రెజ్జాలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు సీఎన్ జీ ఆప్షన్ కూడా ఉంది. పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. 103 బీహెచ్ పీ పవర్ ద్వారా 137 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇక సీఎన్ జీ వెర్షన్ 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. ఇది 88 పీఎస్ పవర్, 121 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. మారుతి బ్రెజ్జా పెట్రోల్ ఇంజిన్ 20.15 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా.. సీఎన్ జీ వెర్షన్ 25.51 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

మార్కెట్లో మారుతి కార్లు తక్కువ ప్రైస్ ను కలిగి ఉంటాయి. అదే విదంగా బ్రెజ్జా ఎస్ యూవీ అయినప్పటికీ మిగతా కార్ల కంటే తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. దీనిని రూ.8.34 లక్షల ప్రారంభ ధర నుంచి రూ. 14.14 లక్షల వరకు విక్రయించనున్నారు. ఇది మార్కెట్లో ఎక్స్ యూవీ 3 ఎస్ 0, నిస్సాన్ మాగ్నైట్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.