Top Pre Release Business Movies: సినిమా థియేటర్ లో రావాలంటే దానికి ముందు వందల కోట్లు ఖర్చు కావాల్సిందే. హీరో హీరోయిన్, సైడ్ క్యారెక్టర్ ల రెమ్యూనరేషన్ ఇవన్నీ ఒకెత్తు అయితే మిగిలిన ఖర్చు మరో ఎత్తు. ఇక రిలీజ్ కు ముందు ఈవెంట్లు అంటూ భారీ మొత్తంలో ఖర్చు చేస్తారు మేకర్స్. అయితే టాప్ హీరోల సినిమాల కంటే కాస్త చిన్న హీరోల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్ లో నడుస్తోంది. అంటే స్టార్ హీరోల సినిమాలకు బిజినెస్ ఎందుకు అభిమానులు ఉంటారు కదా అనుకుంటున్నారా? అవును కావచ్చు.. కానీ స్టార్ హీరోల కంటే కాస్త చిన్న హీరోల సినిమాలకే ఫుల్ బిజినెస్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో సెకండ్ గ్రేడ్‌లో ఉన్న హీరోల టాప్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ఎంత అనేది చూసేద్దాం..
లైగర్ : విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ఆగస్టు 25న విడుదల అయింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ ఇండియా అంతా తిరిగారు కూడా.. వరుస ఇంటర్వ్యూ, ప్రెస్ మీట్ లు పెడుతూ సినిమా హైప్ పెంచేశారు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగానే వస్తాయి అని సినీ వర్గాలు అంచనా వేశారు. కానీ డిజాస్టర్ ఫలితాలను అందుకొని అందరిని నిరాశ పరిచింది సినిమా.ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విజయ్ కెరీర్ లోనే అత్యధికంగా జరిగింది. ఏకంగా రూ. 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ లైగర్ సినిమా కు జరగడంతో సినీ వర్గాలు ఆశ్చర్యపోయారు.
ఖుషీ : విజయ్ దేవరకొండ, సమంత హీరో,హీరోయిన్లుగా నటించిన మూవీ ‘ఖుషీ’. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులను రూ. 53 కోట్లకు అమ్మినట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ బాగా జరిగింది. దీంతో విజయ్ దేవరకొండ క్రేజ్ మరోసారి బయటపడింది అని కొనియాడారు ఆయన అభిమానులు. ఇక నైజాం ఏరియాలో ‘ఖుషి’ థియేట్రికల్ హక్కులను 15 కోట్ల రూపాయలకు ఇచ్చారట. సీడెడ్ రూ. 6 కోట్లకు, ఆంధ్రాలో అన్ని ఏరియాలు కలిపితే రూ. 20 కోట్లకు విక్రయించినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ… రెండు రాష్ట్రాలు కలిపితే మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 41 కోట్లు జరిగింది. ఇక మొత్తం మీద వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే… రూ. 53 కోట్లు జరిగింది.
దసరా : దసరా సినిమా నాని కెరీర్‌లో అత్యధిక ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇప్పటివరకు నాని ఏ సినిమా అమ్ముడుపోని ధరకు అన్ని ఏరియాల్లో దసరా అమ్ముడుపోయింది. ముఖ్యంగా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనూ నాని సినిమాకు ఫుల్ బిజినెస్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని ఏకంగా రూ.34 కోట్ల మేరకు థియేట్రికల్ రైట్స్ విక్రయించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే థియేట్రికల్ రైట్స్ విలువ రూ.50 కోట్ల మేర ఉంది. ఈ సినిమా హిందీ థియేట్రికల్ హక్కుల్ని రూ.4 కోట్లకు విక్రయించారు. ఓవర్సీస్ అయితే రూ.6 కోట్ల పైమాటే.
స్కంద : రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘స్కంద’. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ… రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘స్కంద’ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సుమారు 43 కోట్ల బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాల టాక్. నైజాంలో ‘స్కంద’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ద్వారా సుమారు 14 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిసింది. ఆంధ్రా ఏరియాలు అన్నీ కలిపి రూ. 20 కోట్లు. సీడెడ్ రూ. 9 కోట్ల బిజినెస్ జరిగిందట. తెలుగులో టోటల్ రూ. 43 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది. మరి చూడాలి ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో…
అఖిల్ : అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తూ తన పేరైన ‘అఖిల్’ టైటిల్‌తో చేసిన సినిమా ‘అఖిల్’.వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రూ. 42 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ది వారియర్ : రామ్ పోతినేని, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన మూవీ ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో బై లింగ్వల్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో విడుదలైంది. ఈ సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.02 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా రామ్ కెరీర్‌లోనే సెకండ్ హైయ్యెస్ట్ వసూళ్లను సాధించిన మూవీగా నిలిచింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ఏజెంట్ : అఖిల్, సురేందర్ రెడ్డి, కథని నమ్మి ఏకంగా 50 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు నిర్మాత అనిల్ సుంకర. దీంతో అఖిల్ కెరీర్ లో ఏ సినిమాకు అవ్వనంత ప్రీ రిలీజ్ బిజినెస్ ఏజెంట్ సినిమాకు అయింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏజెంట్ సినిమా 36.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇది అఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్.
డియర్ కామ్రేడ్ : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమాకు 34.60 ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.
జయ జానకి నాయక: బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన మూవీ ‘జయ జానకి నాయక’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 34 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం రేపింది. అయితే ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే.