2023 Hit Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో 2023వ సంవత్సరంలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి.అందులో కొన్ని సినిమాలు విజయం సాధిస్తే మరికొన్ని సినిమాలు మాత్రం ఫ్లాపులుగా నిలిచాయి. ఇక 2023 వ సంవత్సరం చేరుకున్న క్రమంలో ఈ సంవత్సరం మంచి సక్సెస్ ని సాధించిన సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం…
ముందుగా చిన్న సినిమాలుగా వచ్చి మంచి విజయాన్ని సాధించిన సినిమాలలో వేణు దర్శకుడుగా మారి చేసిన బలగం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ ని నమోదు చేసుకోవడమే కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లకి కొత్త ఊపిరిని పోసింది. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా వచ్చిన బేబీ సినిమా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక అలాగే నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.సర్ సినిమా కూడా బస్టర్ హిట్ గా నిలిచింది. ఇలా ఈ సినిమాలు చిన్న సినిమాలుగా వచ్చి ఈ సంవత్సరం మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి…
ఇక పెద్ద సినిమాలుగా వచ్చిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయి మంచి విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాతోనే ఈ ఇయర్ సక్సెస్ ల పరంపర అనేది కొనసాగుతూ వచ్చింది. ఇక వీటితో పాటుగా ఇప్పుడు వచ్చిన సలార్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సంవత్సరం స్టార్ హీరో ల సినిమాలు ఎక్కువగా రాలేదు. చిరంజీవి,బాలయ్య, ప్రభాస్ లు మాత్రమే ఈ ఇయర్ థియేటర్ లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో వచ్చినప్పటికీ అతిపెద్ద ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు సలార్ సినిమా రిలీజ్ అయి సక్సెస్ సాధించటమే కాకుండా ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలో 2023 లో చిన్న సినిమాలు,పెద్దా సినిమాలు అన్నీ మంచి విజయాలను అందుకున్నాయి.
అలాగే ఈ ఇయర్ ఎండింగ్ లో వచ్చిన సలార్ సినిమాతో సరికొత్త రికార్డు అనేది క్రియేట్ అయింది…ఇక ఇప్పుడు మొత్తం సలార్ సినిమా ట్రెండ్ నడుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా మూడు రోజుల్లో 400 కోట్ల కి పైన వసూళ్లను రాబట్టింది…