https://oktelugu.com/

This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో మనల్ని అల్లరించడానికి సిద్ధమైపోయిన సినిమాలు ఇవే…

ఈవారం అన్ని సినిమాల కన్నా ముందుగా థియేటర్ లోకి అడుగుపెడుతున్న మూవీ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక ప్రధాన పాత్ర పోషించింది. అలాగే మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ జైలర్ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది.

Written By: , Updated On : August 8, 2023 / 07:06 PM IST
This Week OTT Releases

This Week OTT Releases

Follow us on

This Week OTT Releases: ప్రతి వారం లాగానే ఈవారం కూడా సినీ ప్రేక్షకుల కోసం థియేటర్స్ లో, ఓటీటీలో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు అల్లరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి అవేవో ఒకసారి చూద్దాం..

థియేటర్స్ లో విడుదల కానున్న సినిమాలు :

జైలర్:

ఈవారం అన్ని సినిమాల కన్నా ముందుగా థియేటర్ లోకి అడుగుపెడుతున్న మూవీ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక ప్రధాన పాత్ర పోషించింది. అలాగే మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ జైలర్ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది.

భోళా శంకర్:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్న సినిమా భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ బోళా శంకర్ మూవీని నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

ఈ సినిమాలతో పాటు మహేష్ బాబు బిజినెస్ మేన్ సినిమా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9 న రీ రిలిజ్ కి సిద్ధంగా ఉంది.

ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు/ వెబ్ సిరీస్:

జియో సినిమా:

జరా హాట్కే జరా బచ్కే (హిందీ) – ఆగస్టు 10

అమెజాన్ ప్రైమ్:

మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 (వెబ్ సిరీస్) ఆగస్టు 10 నుంచి స్ట్రీమింగ్
మహావీరుడు ( శివకార్తికేయన్ మూవీ) – ఆగస్టు 11
రెడ్, వైట్ & రాయల్ బ్లూ (ఇంగ్లీష్) – ఆగస్టు 11

నెట్‌ఫ్లిక్స్:

పద్మిని (మలయాళ చిత్రం) – ఆగస్టు 11
కమాండో (హిందీ సిరీస్) – ఆగస్టు 11
బిహైండ్ యువర్ టచ్ (కొరియన్ సిరీస్) – ఆగస్టు 12
లేడీస్ ఫస్ట్: ఏ స్టోరీ ఆఫ్ ఏ ఉమన్ ఇన్ హిప్ హాప్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 08
అన్‌టోల్డ్: జానీ ఫుట్ బాల్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 08
జాంబీవర్స్ (కొరియన్ సిరీస్) – ఆగస్టు 08
ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 08
మెక్ క్యాడెట్స్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 10
పెయిన్ కిల్లర్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 10
హార్ట్ ఆఫ్ స్టోన్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 11

ఆహా:

హిడింబ (తెలుగు) – ఆగస్టు 10 రాత్రి 7 నుంచి స్ట్రీమింగ్
వేరే మారి ఆఫీస్ (తమిళ వెబ్ సిరీస్) – ఆగస్టు 10
వాన్ మూండ్రు (తమిళ మూవీ) – ఆగస్టు 11

జీ5:

ది కాశ్మీర్ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ – ఆగస్టు 11
అభర్ ప్రళయ్ (బెంగాలీ సిరీస్) – ఆగస్టు 11

సోనీ లివ్:

జెంగబూరు కర్స్ (హిందీ సిరీస్) – ఆగస్టు 09
పోర్ తోడిల్ (తెలుగు డబ్బింగ్) – ఆగస్టు 11న

డిస్నీ+ హాట్ స్టార్:

నేయ్మర్ (తెలుగు డబ్బింగ్) – ఆగస్టు 8