https://oktelugu.com/

Popular Songs 2024 :  ఈ ఏడాది అత్యంత పాపులర్ అయిన పాటలు ఇవే!

ఈ ఏడాది ఎన్నో పాటలు ప్రేక్షకులను మెప్పించాయి. మరి ఈ ఏడాది బాగా పాపులర్ అయిన టాప్ 10 పాటలు ఏవో మీరు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 24, 2024 / 12:45 PM IST

    Popular Songs 2024

    Follow us on

    Popular Songs 2024 : మరికొన్ని రోజుల్లో 2024 ఏడాది పూర్తి కాబోతుంది. అయితే ఈ ఏడాది మొత్తం సినిమా రంగంలో ఎన్నో కొత్త పాటలు వచ్చాయి. పాటలు మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఏదైనా పాట కొత్తగా ఉండి బాగుంటే చాలు.. ఆ పాటను వైరల్ చేసేస్తారు. అయితే ఈ ఏడాది ఎన్నో పాటలు ప్రేక్షకులను మెప్పించాయి. మరి ఈ ఏడాది బాగా పాపులర్ అయిన టాప్ 10 పాటలు ఏవో మీరు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మొత్తం చదివేయండి.

    ఆజ్ కీ రాత్
    స్త్రీ సినిమా నుంచి విడుదలైన ఆజ్ కీ రాత్ సాంగ్ ఈ ఏడాది టాప్‌ ప్లేస్‌లో ఉంది. తమన్నా భాటియా పాటకి మధుబంతి బాగ్చి, దివ్వ కుమార్ పాడిన ఈ పాట యూట్యూబ్‌లో 688 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది.

    కుర్చీ మడతపెట్టి
    డైరెక్టర్ త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. ఇందులో మహేశ్ బాబు మాస్ స్టెప్‌లు, శ్రీలీల డ్యాన్స్ ప్రేక్షకులను షేక్ చేశాయి. థమన్ మ్యూజిక్ డైరెక్షన్‌లో శ్రీ కృష్ణ, సాహితీ ఈ పాటను పాడారు. సోషల్ మీడియాలో ఈ పాట 515 మిలియన్ల వ్యూస్ సంపాదించుకుని రెండో స్థానంలో నిలిచింది.

    ఆయీ నాయి
    స్త్రీ సినిమా నుంచి విడుదలైన ఆయీ నాయి పాట 458 మిలియన్ వ్యూస్ సంపాదించుకుని మూడో స్థానంలో నిలిచింది. ఈ పాటను దివ్వ కుమార్, పవన్ సింగ్ పాడారు.

    తేరీ బాటూన్ మే ఆసియా
    ఈ పాటను రాఘవ్, తనిష్క్ బాగ్చి పాడారు. యూట్యూబ్‌లో 422 మిలియన్ వ్యూస్ సంపాదించుకుని నాలుగో స్థానంలో నిలిచింది.

    తౌబా తౌబా
    విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రీ నటించిన బ్యాడ్ న్యూజ్ నుంచి తౌబా తౌబా పాట ఐదో స్థానంలో నిలిచింది. ఈ పాటను కరణ్ ఔజ్లూ పాడారు. యూట్యూబ్‌లో ఈ పాట 376 మిలియన్ల వ్యూస్ సంపాదించుకుంది.

    గులాబీ శాడీ
    ఈ గులాబీ శాడీ ఒక ప్రైవేట్ సాంగ్. ఈ పాట సోషల్ మీడియాలో 328 మిలియన్ వ్యూస్ సంపాదించుకుని ఆరో స్థానంలో నిలిచింది. సోషల్ మీడియాలో ఈ పాట అప్పట్లో బీభత్సంగా ట్రెండ్ అయ్యింది.

    అచాచో పాట
    తమన్నా, రాశీ ఖన్నా నటించిన అచాచో పాట ఈ ఏడాది పాపులర్ అయిన పాటల్లో ఒకటి. యూట్యూబ్‌లో మొత్తం 273 మిలియన్ల వ్యూస్ సంపాదించుకుని ఏడో స్థానంలో నిలిచింది.

    చుట్టమల్లే
    ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబోలో వచ్చిన దేవర సినిమా ఈ ఏడాది హిట్ కొట్టింది. ఇందులోని చుట్టమల్లే సాంగ్ యూట్యూబ్‌లో 268 మిలియన్ల వ్యూస్ సంపాదించుకుని ఎనిమిదో స్థానంలో నిలిచింది.

    ఇల్లు మినాచి పాట
    ఈ ఏడాది ఇల్లు మినాచి పాట 237 మిలియన్ల వ్యూస్ సంపాదించుకుని తొమ్మిదో స్థానంలో నిలిచింది.

    అఖియాన్ గులాబ్ పాట
    ఈ పాట యూట్యూబ్‌లో 223 మిలియన్ల వ్యూస్ సంపాదించుకుని పదవ స్థానంలో నిలిచింది. ఈ పాటను మిత్రజ్ అనే సింగర్ పాడాడు.