Santa Claus-Coca Cola : క్రిస్మస్ వస్తుదంటే చాలు.. అందరికీ శాంటా గిఫ్ట్‌లు గుర్తు వస్తాయి. ఎందుకంటే క్రిస్మస్‌కి ప్రతీ ఆఫీస్, చర్చ్‌లలో శాంటా గిఫ్ట్‌లు ఇచ్చుకుంటారు. అంటే ఒక కంపెనీలో ఉన్న అందరి పేర్లను ఒక బాక్స్‌లో వేస్తారు. ఒక్కోరి ఒక్కో పేరును తీసుకుంటారు. అందులో ఎవరి పేరు ఉంటే వారికి మీరు గిఫ్ట్ ఇవ్వాలి. దీన్నే శాంటా గిఫ్ట్ అని అంటారు. అయితే ఈ శాంటా క్లాజ్‌ను కోకా కోలా సృష్టించిందని కొందరు అంటుంన్నారు. అలసు శాంటా క్లాజ్‌కి, కోకా కోలాకి లింక్ ఏంటి? అసలు శాంటాను కోకా కోలా సృష్టించడం ఏంటి? పూర్తి వివరాలు తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.
ప్రస్తుతం మనమందరం చూస్తున్న శాంటా క్లాజ్ రూపం నిజమైన శాంటా క్లాజ్‌ది కాదట. 1927కి ముందు శాంటా క్లాజ్‌కి అసలు ఒక రూపం లేదట. ధనికుడైన సెయింట్ నికోలస్ అనే వృద్ధుడు టైమ్ పాస్ కోసం రోజూ సాయంత్రం బయటకు వెళ్లేవాడు. ఇలా వెళ్లే సమయంలో చాలా మంది తిండి, బట్టలు లేకుండా రోడ్డు మీద జీవనం సాగించడం చూశాడు. వారిని చూసి మనస్సు చలించిపోవడంతో రాత్రి సమయాల్లో వారికి తెలియకుండా వెళ్లి దుప్పట్లు, బట్టలు, ఆట వస్తువులు ఇలా అన్ని ఇచ్చేవాడు. అయితే తన స్వరూపం కనిపించకుండా తలకు టోపి, కోటు ధరించి ఇలా సాయం చేసేవాడు. ఇతన్నే శాంటా క్లాజ్ అని పిలుస్తారు. అయితే శాంటా క్లాజ్ రియల్‌గా ఎలా ఉంటారనే విషయం ఎవరికీ తెలియదు. అతను చనిపోయిన 1700 సంవత్సరాల తర్వాత పరిశోధకులు అతని పుర్రెపై పరిశోధనలు చేశారు. సెయింట్ నికోలస్ పుర్రె ఆధారంగా ఆయన త్రిడీ ఫేస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. లూగి మార్టిన్ అనే పరిశోధకుడు పుర్రెను సేకరించాడు. ఆ తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత సిసిరో మోరిస్ అనే శాస్త్రవేత్త శాంటా క్లాజ్ చిత్రాన్ని రూపొందించాడు. తెల్లని గడ్డం, ఎరుపు దుస్తులు, పొట్ట అని చిత్రంలో గీశారు. దీంతో శాంటా క్లాజ్ ఇలానే ఉంటారని అందరూ భావిస్తారు.
కోకా కోలాకి శాంటా క్లాజ్ లింక్ ఏంటి?
కోకా కోలా తమ కంపెనీ ప్రొడక్ట్‌లను పాపులర్ చేసుకోవడానికి ఎరుపు రంగు దుస్తులు ఉండే శాంటా క్లాజ్‌ను ప్రమోట్ చేశాయి. 1931లో తన వ్యాపార ప్రకటనల ఈ శాంటా క్లాజ్‌ను ఉపయోగించుకున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా శాంటా క్లాజ్ గురించి బాగా తెలిసింది. దీంతో కోకా కోలా శాంటా క్లాజ్‌ను సృష్టించిందని భావించారు. కేవలం తమ వ్యాపార ప్రకటనల కోసం మాత్రమే కోకా కోలా శాంటా క్లాజ్‌ను ఉపయోగించుకుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.