Adipurush Final Trailer : ఆదిపురుష్ లో ఇదే పెద్ద మైనస్

ఈ ట్రైలర్ లో ఉన్న ఏకైక మైనస్ పాయింట్ ఏమిటంటే ప్రభాస్ డైలాగ్ డెలివరీ. నిద్రమత్తులో డైలాగ్స్ చెప్పినట్టుగా అనిపించింది. దీనిని థియేటర్స్ లో వచ్చినప్పుడు ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి.

Written By: NARESH, Updated On : June 6, 2023 10:06 pm
Follow us on

Adipurush Final Trailer : ప్రభాస్ కెరీర్ లోనే ‘ఆదిపురుష్’ అతిపెద్ద ఫిల్మ్. బాహుబలితో ప్యాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్.. ఆ తర్వాత ఆదిపురుష్ తో ఇండియా లెవల్ లో తన స్థానాన్ని మరింత ఇనుమడింపచేశారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ పై ఇప్పటికే విమర్శలు వచ్చాయి. అసలు రాముడికి మీసాలు పెట్టడమే పెద్ద బ్లండర్ అని అందరూ తిట్టిపోశారు. ఇక రావణాసురుడిని మోడ్రన్ రాక్షసుడిగా చూపించడాన్ని తప్పుపట్టారు. దీంతో మొత్తం సినిమా విడుదలను వాయిదావేసేసి మళ్లీ రీష్యూట్ చేసి మరీ ఈ జూన్ కు విడుదల చేస్తున్నారు.

గతంలో ఆదిపురుష్ తొలి ట్రైలర్ విడుదలైనప్పుడు దాన్నో కార్టూన్ సినిమాలా అందరూ గెలిచేశారు. తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే దీనిపై ప్రభాస్ కూడా నొచ్చుకున్నాడు. ఆదిపురుష్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయకుండా వాయిదా వేయించాడు. ఈ జూన్ కు మార్చాడు. ఈ ఆరు నెలల్లో ఆ కార్టూన్ విజువల్స్ అన్నింటిని మళ్లీ చేయించి పకడ్బందీగా వీఎఫ్ఎక్స్ చేశారు. ఇప్పుడు ఫైనల్ ట్రైలర్ విడుదల చేశారు. ఇది అదిరిపోయేలా వచ్చింది. యాజ్ టీజ్ రామాయణాన్ని.. నాటి నేటివిటీని.. రాముడి శక్తి, హనుమాన్ యుక్తి బలం ఇలా అన్నింటిని పక్కాగా తీసినట్టుగా ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు తిరుపతి లో కనీవినీ ఎరుగని రేంజ్ లో జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసింది మూవీ టీం. ఈ ట్రైలర్ మొదట విడుదల చేసిన ట్రైలర్ కంటే అద్భుతంగా ఉంది. మొదటి ట్రైలర్ లో మొత్తం రామాయణం ఓవర్ వ్యూ చూపించగా, రెండవ ట్రైలర్ లో ఎక్కువగా రామ – రవాణా యుద్ధం, సీతని రావణాసురుడు అపహరించడం వంటివి చూపించారు.

ఈ ట్రైలర్ లో ఉన్న ఏకైక మైనస్ పాయింట్ ఏమిటంటే ప్రభాస్ డైలాగ్ డెలివరీ. నిద్రమత్తులో డైలాగ్స్ చెప్పినట్టుగా అనిపించింది. దీనిని థియేటర్స్ లో వచ్చినప్పుడు ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి. మొదటి ట్రైలర్ లో కూడా ప్రభాస్ చాలా డల్ డైలాగ్ డెలివరీ తో కానిచ్చేశాడు. సినిమాలో డబ్బింగ్ బాగుంటుందని అందరూ అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా విడుదల చేసిన ట్రైలర్ లో మాత్రం అలా అనిపించలేదు.