Adipurush Trailer Highlights : ఆదిపురుష్ ట్రైలర్ లో ఇదే హైలెట్

ఇక విజువల్ ఎఫెక్ట్స్ అయితే హాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా చూపించారు. అయితే లాస్ట్ షాట్ లో రావణాసురిడి పది తలలు సరిగ్గా చూపించి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇక వానర సైన్యం మొత్తాన్ని మనం హాలీవుడ్ సినిమాలలో తప్ప, అంత న్యాచురల్ గా ఎప్పుడూ చూడలేదు.

Written By: NARESH, Updated On : June 6, 2023 9:57 pm
Follow us on

Adipurush Trailer Highlights : గతంలో ఆదిపురుష్ తొలి ట్రైలర్ విడుదలైనప్పుడు దాన్నో కార్టూన్ సినిమాలా అందరూ గెలిచేశారు. తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే దీనిపై ప్రభాస్ కూడా నొచ్చుకున్నాడు. ఆదిపురుష్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయకుండా వాయిదా వేయించాడు. ఈ జూన్ కు మార్చాడు. ఈ ఆరు నెలల్లో ఆ కార్టూన్ విజువల్స్ అన్నింటిని మళ్లీ చేయించి పకడ్బందీగా వీఎఫ్ఎక్స్ చేశారు. ఇప్పుడు ఫైనల్ ట్రైలర్ విడుదల చేశారు. ఇది అదిరిపోయేలా వచ్చింది. యాజ్ టీజ్ రామాయణాన్ని.. నాటి నేటివిటీని.. రాముడి శక్తి, హనుమాన్ యుక్తి బలం ఇలా అన్నింటిని పక్కాగా తీసినట్టుగా ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు తిరుపతి లో కనీవినీ ఎరుగని రేంజ్ లో జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసింది మూవీ టీం. ఈ ట్రైలర్ మొదట విడుదల చేసిన ట్రైలర్ కంటే అద్భుతంగా ఉంది. మొదటి ట్రైలర్ లో మొత్తం రామాయణం ఓవర్ వ్యూ చూపించగా, రెండవ ట్రైలర్ లో ఎక్కువగా రామ – రవాణా యుద్ధం, సీతని రావణాసురుడు అపహరించడం వంటివి చూపించారు.

ఇలాంటి గ్రాఫిక్స్ తో ఇప్పటి వరకు రామాయణం మీద ఎవ్వరూ సినిమాలు తీయలేదు. మొట్టమొదటి సారి రామాయణాన్ని ఆ గ్రాఫిక్స్ లో చూసేసరికి ఫ్యాన్స్ , ఆడియన్స్ చాలా థ్రిల్ కి గురి అయ్యారు. కచ్చితంగా థియేటర్ లో చూడాల్సిందే అని అనిపించేలా చేసింది ఈ ట్రైలర్.

ఇక విజువల్ ఎఫెక్ట్స్ అయితే హాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా చూపించారు. అయితే లాస్ట్ షాట్ లో రావణాసురిడి పది తలలు సరిగ్గా చూపించి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇక వానర సైన్యం మొత్తాన్ని మనం హాలీవుడ్ సినిమాలలో తప్ప, అంత న్యాచురల్ గా ఎప్పుడూ చూడలేదు. గ్రాఫిక్స్ మీద మూవీ టీం రీ వర్క్ కాస్త ఫలితానికి దక్కిన ప్రతిఫలం ఇది. చూడాలి మరి 16 వ తేదీ ఈ సినిమా ఇంకెన్ని అద్భుతాలు సృష్టించబోతోంది అనేది.