Chinmayi vs Sivaji: రీసెంట్ గా ప్రముఖ నటుడు శివాజీ(Sivaji) తన కొత్త సినిమా ‘దండోరా'(Dandora Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ బట్టల గురించి చేసిన కామెంట్స్ ఎంతటి దుమారం రేపాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. రోజురోజుకి ఈ అంశం గురించి చర్చ పెరుగుతూనే ఉంది కానీ, తరగడం లేదు. శివాజీ బహిరంగంగా క్షమాపణలు చెప్పినప్పటికీ ఆయన్ని చిన్మయి , అనసూయ వంటి వారు వదలడం లేదు. ఈ సమాజం లో ఆడవాళ్లకు ఏ చిన్న సమస్య వచ్చినా స్పందించడానికి ముందు వరుసలో ఉంటారు ఈ ఇద్దరు సెలబ్రిటీలు. కానీ శివాజీ కంటే పెద్ద స్థాయిలో ఉన్నవాళ్లు, అటు సినీ రంగం లో, ఇటు రాజకీయ రంగం లో పలుకుబడి ఉన్న నటీనటులు ఎన్నిసార్లు నోరు జారినా వీళ్లిద్దరికీ ఎలాంటి సమస్య లేదు. వాళ్ళని పల్లెత్తి ఒక్క మాట కూడా అనలేరు.
శివాజీ చెడ్డ మాటలు ఏమి చెప్పలేదు. చీరలోనే అందం ఉంటుంది, సామాన్లు కనిపించేలా వేసుకునే పొట్టి బట్టల్లో కాదు, కాస్త పద్దతిగా ఉండండి అని హీరోయిన్స్ కి చెప్పాడు. ఇక్కడ ఆయన ఉపయోగించిన ‘సామాన్లు’ అనే పదం తప్పే, దానిని శివాజీ కూడా సమర్ధించుకోలేదు, ఆ పదాలు ఉపయోగించినందుకు క్షమాపణలు చెప్పాడు. అంతే కానీ, తన ఉద్దేశ్యం లో ఎలాంటి తప్పు లేదుకదా, అది తన అభిప్రాయం మాత్రమే అని జనాలు అంటున్న మాట. దీన్ని ఎందుకు ఇంత పెద్ద వివాదం చేస్తున్నారు? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశ్నించడం మొదలు పెట్టారు. అయితే చిన్మయి ఆడవాళ్ళ గౌరవాన్ని కాపాడడం కోసమే పుట్టినట్టు మాట్లాడుతూ ఉంటుంది కదా, గతం లో ఈమె ‘రోబో’ చిత్రం లో పాడిన ‘కిల్లి మంజారో’ పాటలో ఒక చరణం అర్థాన్ని వివరిస్తూ, బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ శేఖర్ బాషా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది.
ఆయన మాట్లాడుతూ ‘ కిల్లి మంజారో పాట విన్నారా?, ఆ పాటని మన చిన్మయి గారే పాడారు. అందులో ‘నా సోకు పల్లే తిని, నన్ను పట్టి ఆరబట్టే హానీ’ అనే చరణం ఉంటుంది. ఆడవాళ్లు అంటే విపరీతమైన గౌరవం ఉండే చిన్మయి గారు, ఇలా మహిళా శరీరం లో భాగాలను పదార్దాలతో పోల్చి ఎలా పాడుతుంది?, శివాజీ సామాన్లు అన్న పదం వీళ్లకు సమస్య అయ్యినప్పుడు, ఆ పాటలోని పదాలు వీళ్లకు సమస్య కాదా?, చిన్మయి చేత ఈ పాటని ఎవరైనా ఆమె నెట్టి పై గన్ పెట్టి పాడించారా?, డబ్బులిస్తే ఎంతకైనా దిగజారతారా?’ అని శేఖర్ బాషా మాట్లాడిన మాటలు గన్ షాట్స్ లాగా పేలాయి. దీనిని చిన్మయి సమాధానం చెప్పగలదో లేదో చూద్దాం. సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయిన ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
Thopuuu Point ✍️ pic.twitter.com/MA8otGOGXb
— (@Ntr1166177) December 25, 2025