https://oktelugu.com/

Vishwambhara Teaser: రేపు విడుదల అవ్వబోతున్న ‘విశ్వంభర’ టీజర్ లో హైలైట్స్ ఇవే..మెగా ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్!

'భింబిసారా' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన వసిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టాకీ పార్ట్ దాదాపుగా ముగిసింది. కేవలం క్లైమాక్స్ మరియు రెండు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 11, 2024 / 05:03 PM IST

    Vishwambhara Teaser

    Follow us on

    Vishwambhara Teaser: గత ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన మెగాస్టార్ చిరంజీవి, అదే ఏడాది భోళా శంకర్ లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని ఇచ్చి మెగా ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపర్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి డిజాస్టర్ ఫ్లాప్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ మొత్తం లో లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2001 వ సంవత్సరం లో వచ్చిన చిరంజీవి డిజాస్టర్ చిత్రం ‘మృగరాజు’ కంటే తక్కువ వసూళ్లు వచ్చిన సెంటర్స్ చాలా ఉన్నాయి. దీనిని బట్టి ఎంత పెద్ద ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అభిమానులు మెగాస్టార్ నుండి ఒక భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. సరిగ్గా అలాంటి సమయం లోనే మెగాస్టార్ ‘విశ్వంభర’ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాన్ని ప్రకటించాడు.

    ‘భింబిసారా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన వసిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టాకీ పార్ట్ దాదాపుగా ముగిసింది. కేవలం క్లైమాక్స్ మరియు రెండు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉంది. అయితే ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ‘దసరా’ కి విడుదల చేస్తామని సోషల్ మీడియా లో చాలా కాలం నుండి ప్రచారం లో ఉంది కానీ, అధికారిక ప్రకటన మాత్రం కాసేపటి క్రితమే జరిగింది. చక్రం లోగో ఉన్నటువంటి చైన్ ని నీటిలో నుండి పైకి తీస్తున్న ఫోటో ని విడుదల చేస్తూ, సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు బ్రేకింగ్ అప్డేట్ అని ఒక ట్వీట్ వేశారు. ఇది టీజర్ గురించి అప్డేట్ అనేది అందరికీ అర్థం అయిపోయింది. రేపు హైదరాబాద్ లోని విమల్ థియేటర్ లో 10 గంటలకు ఈ టీజర్ ని లాంచ్ చేయబోతున్నారట. ఈ టీజర్ లో గ్రాండ్ విజువల్స్ ఉంటాయట. విశ్వంభర మీట్స్ హనుమాన్ అనే క్యాప్షన్ తో ఈ టీజర్ ని విడుదల చేయబోతున్నారట.

    ఇప్పటికే టైటిల్ టీజర్ ని విడుదల చేసారు. చూసేందుకు చాలా గ్రాండియర్ గా, ఎంతో క్వాలిటీ తో ఆ టైటిల్ టీజర్ కనిపించింది. మెగాస్టార్ నుండి ఇలాంటి సినిమానే కదా ఇన్ని రోజులు కోరుకుంది అని ఫ్యాన్స్ ఎంతో సంతోషపడ్డారు. రేపు విడుదలయ్యే టీజర్ దానికి పది రేట్లు క్వాలిటీ తో ఉంటుందట. ఇందులో చిరంజీవి హనుమాన్ ని కలిసే షాట్ వేరే లెవెల్ లో ఉంటుందని టాక్. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా తాడితడుర్లు ముఖ్య పాత్రలు పోషితున్నారు. మిగిలిన పాత్రలను ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంచారు.