Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత ఆట రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ కూడా అదిరిపోయింది, అయితే ఈ వారం బిగ్ బాస్ సరైన టాస్క్ ఇవ్వలేదని చాలా మందికి అనిపించింది. ప్రతీ సీజన్ లో ఉన్నట్టుగానే ఈ సీజన్ లో కూడా హోటల్ టాస్క్ ఉంది. ఈ టాస్క్ చాలా సరదాగా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఉండేది. కానీ ఈ సీజన్ లో మాత్రం బోర్ కొట్టేసింది. కేవలం అవినాష్, రోహిణి,యష్మీ మాత్రమే టాస్క్ లో ఎంటర్టైన్మెంట్ ని అందించారు. మిగిలిన వాళ్ళు ఎదో ఆడాలి కాబట్టి ఆడాము అన్నట్టుగా ఆడారు. ఇదంతా పక్కన పెడితే నిన్న బిగ్ బాస్ హౌస్ లో చీఫ్ కంటెండర్స్ టాస్క్ ని నిర్వహించారు. రాయల్ క్లాన్ సభ్యులు హోటల్ టాస్క్ లో గెలవడంతో, బిగ్ బాస్ వాళ్ళ క్లాన్ నుండి ఆరు మంది పోటీలోకి వచ్చే అవకాశాన్ని ఇస్తాడు. గంగవ్వ, టేస్టీ తేజా మినహా, మిగిలిన వాళ్ళు మొత్తం పోటీ లోకి దిగుతారు.
ఓజీ క్లాన్ నుండి కేవలం మణికంఠ మాత్రమే చీఫ్ పోటీ దారుడిగా ఎంపిక కాబడుతాడు. గత సీజన్ చివర్లో అమర్ దీప్ మరియు పల్లవి ప్రశాంత్ మధ్య ఎవ్వరూ ఊహించని రేంజ్ గొడవ జరగడానికి కారణమైన బాల్స్ టాస్క్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అదే టాస్క్ ని ఇప్పుడు మెగా చీఫ్ పోటీలకు పెట్టారు. ఈ టాస్క్ లో మెహబూబ్ గెలిచి హౌస్ కి మెగా చీఫ్ అవుతాడు. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ లో నామినేషన్స్ లోకి మొదటి వారమే వచ్చిన మెహబూబ్, అదే మొదటి వారం లో హౌస్ కి మెగా చీఫ్ అవ్వడం విశేషం. ఈ టాస్క్ నేటి ఎపిసోడ్ లో టెలికాస్ట్ కానుంది. ఇదంతా పక్కన పెడితే పాత మెగా చీఫ్ నభీల్ ప్రేరణ పై పీకల దాకా కోపం పెంచేసుకున్నాడు అనేది ఈరోజుటి ఎపిసోడ్ తో తేలిపోనుంది. ప్రేరణ నభీల్ కి ఎంతో గౌరవం ఇస్తుంది, తన స్నేహితుడిగా భావించింది. కానీ నభీల్ మాత్రం ప్రేరణ వెనుక చేరి ఆమె గురించి ఎన్నో మాటలు అన్నాడు. ముఖ్యంగా సీత ముందు ప్రేరణ గురించి తక్కువ చేసి మాట్లాడడాన్ని చూస్తుంటే నభీల్ ప్రేరణ పట్ల తీవ్రమైన అసూయతో రగిలిపోతున్నాడు అనే విషయం అర్థం అవుతుంది.
టాస్కులు వచ్చినప్పుడు ఈ వారం ప్రేరణ ని తొక్కే ప్రయత్నం చేసాడు నభీల్. అంతే కాదు ఏదైనా అవసరం వచ్చినప్పుడు నభీల్ ని పిలిస్తే కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ ఎపిసోడ్ తో నభీల్ గ్రాఫ్ పాతాళ లోకంలోకి వెళ్ళిపోతుందని బిగ్ బాస్ లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్న వాళ్ళు చెప్తున్న మాట. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి మరి. అలాగే శనివారం జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని నేడే పూర్తి చేశారట. ఈ ఎపిసోడ్ లో పృథ్వీ నామినేషన్స్ నుండి సేవ్ అయ్యినట్టు తెలుస్తుంది.