Project K Teaser: యంగ్ రెబెల్ స్టార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’. మహానటి దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుమారుగా 600 కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి తీస్తున్నాడు ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్. టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియో ని రేపు అన్నీ భాషల్లో ఘనంగా విడుదల చెయ్యబోతున్నారు.
ఈ గ్లిమ్స్ ద్వారా అసలు ప్రాజెక్ట్ K అంటే ఏమిటి? అనే విషయం అందరికీ తెలియనుంది. రేపు సాన్ డియెగో లో ఈ గ్లిమ్స్ వీడియో ని విడుదల చెయ్యబోతున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఇందుకోసం మూవీ యూనిట్ తో పాటుగా అమెరికా కి చేరుకున్నాడని, రేపు అభిమానులకు ఒక పండుగ లాగ ఉంటుందని మేకర్స్ చెప్పుకొచ్చారు.
ఈ గ్లిమ్స్ వీడియో లో ప్రభాస్ , అమితాబ్ బచ్చన్ , దీపికా పడుకొనే, దిశా పటాని కనిపించబోతున్నారట. ప్రభాస్ ఇందులో సూపర్ హీరో గా నటిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ మహాభారతం లోని అశ్వద్ధామ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ రేపు విడుదల అవ్వబోతున్న ఆ గ్లిమ్స్ వీడియో లో చూపించబోతున్నారట. సుమారుగా నిమిషం నిడివి ఉన్న ఈ గ్లిమ్స్ వీడియో ఫ్యాన్స్ కి పండుగ చేసుకునే విధంగా ఉంటుందని.
కచ్చితంగా న్యూట్రల్ ఆడియన్స్ కి కూడా ఈ గ్లిమ్స్ వీడియో తెగ నచ్చేస్తుందని చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం ప్రముఖ తమిళ్ హీరో కమల్ హాసన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఆయన ఇంకా షూటింగ్ లో పాల్గొనలేదు. ఆగష్టు నుండి ఆయన పాత్రకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ గ్లిమ్స్ వీడియో లో కమల్ హాసన్ కనిపించే ఛాన్స్ లేదని అంటున్నారు.