Homeఎంటర్టైన్మెంట్Most Lonely Heroines: తోడు లేక ఒంటరితనంతో బాధపడుతున్న హీరోయిన్లు...

Most Lonely Heroines: తోడు లేక ఒంటరితనంతో బాధపడుతున్న హీరోయిన్లు వీళ్లే

Most Lonely Heroines: భర్తతో జీవితాంతం సంతోషంగా ఉండాలనే కోరిక పెళ్లైన ప్రతి యువతిలోనూ ఉంటుంది. హీరోయిన్లు కూడా అందుకు అతీతులు కారు. భర్తతో గడిపే క్షణాలు కంటే మ‌ధుర క్ష‌ణాలు స్త్రీ జీవితంలో ఉండ‌వు కాబట్టి.. భర్త ప్రేమ కోసం ప్రతి స్త్రీ ఎంతగానో పరితపిస్తోంది. అయితే, పెళ్లి అయిన కొంతకాలానికే కొంతమంది హీరోయిన్లు తమ భర్తలను కోల్పోయారు. భర్తను కోల్పోయి జీవితంలో ఒంటరిగా మిగిలిపోయిన ఆ హీరోయిన్లు ఎవరో చూద్దాం.

హీరోయిన్ మేఘన రాజ్:

Meghana Raj
Meghana Raj

కన్నడ నాట స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు చిరంజీవి సర్జా. చిరంజీవి హీరోయిన్ మేఘన రాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే.. పెళ్లయిన తర్వాత రెండేళ్లకే చిరంజీవి సర్జా చనిపోయాడు. దాంతో మేఘన రాజ్ శోకసంద్రంలో మునిగిపోయింది. పైగా భర్త చనిపోయే నాటికి మేఘన రాజ్ ఐదు నెలల గర్భవతి.

అలనాటి అందాల తార భానుప్రియ :

Bhanupriya
Bhanupriya

 

 

 

సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా గొప్ప గుర్తింపు దక్కించుకుంది భానుప్రియ. ఆమె ఆదర్శ కౌశల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తన భర్తతో పాటు అమెరికా కూడా వెళ్లి పోయింది. కొన్నేళ్లు భర్తతో ఎంతో సంతోషంగా ఉంది. కానీ చివరికి భర్తతో గొడవలు రావడంతో అతనికి దూరం అయ్యింది. కానీ అంతలో భానుప్రియ భర్త గుండెపోటు కారణంగా చనిపోయాడు.

సీనియర్ నటి కవిత :

KAVITHA
KAVITHA

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒకప్పుడు మంచి సినిమాలు చేసింది కవిత. కవిత భర్త దశరథ రాజు కరోనా కారణంగా చనిపోయాడు. ప్రస్తుతం ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతుంది.

మోడ్రన్ నటి మందిరా బేడీ :

mandira bedi
mandira bedi

బాలీవుడ్ నటి మందిరా బేడీ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. లేటు వయసులో కూడా ఘాటు ఫోజులు ఇవ్వడంలో ఆమె మేటి. అయితే, ఆమె భర్త దర్శకుడు రాజ్ కౌశల్ హఠాత్తుగా తన 50 ఏళ్ల వయసులో గుండెపోటుతో చనిపోయారు. ప్రస్తుతం మందిరా బేడీ ఒంటరిగానే ఉంటుంది.

తెలుగు నటి సురేఖ వాణి :

Surekha Vani
Surekha Vani Pics

సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న నటి సురేఖా వాణి. ఆమె సురేష్ తేజ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. టీవీ ప్రోగ్రామ్స్ కి, టీవీ షోలకు డైరెక్టర్ గా సురేష్ తేజ పని చేసేవారు. కానీ అనారోగ్యంతో ఆయన మృతి చెందారు. ఇక ప్రస్తుతానికి సురేఖా వాణి మరో పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతుంది.

రేఖ :

REKHA
REKHA

హీరోయిన్ రేఖ.. ‘హాట్ లైన్ కిచెన్ వేర్’ సంస్థ యజమాని ముఖేష్ అగర్వాల్ ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే, ముఖేష్ తో ఆమెకు మనస్పర్థలు వచ్చి విడిపోయింది. ఆ తర్వాత తన వ్యాపారంలో నష్టాలు రావడంతో ముఖేష్ అగర్వాల్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు.

జయసుధ :

Jayasudha
Jayasudha

సహజ నటి జయసుధ, నితిన్ కపూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలారు. అప్పటి నుంచి జయసుధ ఒంటరిగానే ఉంటున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version